సన్‌రైజర్స్‌కి అదిరిపోయే పంచ్ ఇచ్చిన డేవిడ్ వార్నర్ భార్య... నీకు వయసైపోయిందంటారా...

Published : Nov 15, 2021, 01:11 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు సంగతి. ఐపీఎల్ 2021 సీజన్‌లో అనేక అవమానాలను అనుభవించిన డేవిడ్ వార్నర్, వార్మప్ మ్యాచుల్లో కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో వార్నర్ పనైపోయిందనుకున్నారంతా... అయితే టోర్నీ మొదలయ్యాక వార్నర్ భాయ్ అసలు సిసలు షో మొదలైంది...

PREV
113
సన్‌రైజర్స్‌కి అదిరిపోయే పంచ్ ఇచ్చిన డేవిడ్ వార్నర్ భార్య... నీకు వయసైపోయిందంటారా...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా పరిస్థితి కూడా ఏ మాత్రం సరిగా లేదు. వరుసగా ఐదు టీ20 టోర్నీల్లో ఓడిన ఆస్ట్రేలియా... వెస్టిండీస్, బంగ్లాదేశ్ వంటి జట్లతోనూ చిత్తుగా ఓడి, వరల్డ్‌కప్‌కి వచ్చింది...

213

కెప్టెన్ ఆరోన్ ఫించ్, సీజన్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 91 పరుగులు మాత్రమే చేయగలిగాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్...

313

అలాగే ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ కూడా సీజన్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. టీ20ల్లో స్టీవ్ స్మిత్ సెట్ కాడనే విమర్శలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి... అందుకే స్మిత్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి దించింది ఆసీస్...

413

ఇన్ని సమస్యలు ఉన్నా ఆస్ట్రేలియా ఫైనల్‌కి చేరి, టైటిల్ నెగ్గిందంటూ దానికి ముఖ్యంగా డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ఆడమ్ జంపా, జోష్ హజల్‌వుడ్‌లే కారణం...

513

సీజన్‌లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 48.16 సగటుతో 289 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు...

613

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల వద్ద అవుటైన డేవిడ్ వార్నర్, అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా పెవిలియన్ చేరాడు. బంతి బ్యాటుకి తగలకపోయినా, డీఆర్‌ఎస్ తీసుకోకుండా వార్నర్ పెవిలియన్ చేరడం పలు అనుమానాలకు తావిచ్చింది.

713

న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్ 5 పరుగులకే అవుట్ కాగా, డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసి జట్టుకి ఎంతో విలువైన పరుగులు చేశాడు...

813

అంతేకాకుండా మిచెల్ మార్ష్‌తో కలిసి రెండో వికెట్‌‌కి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టోర్నీలో వార్నర్ ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా అందుకున్నాడు... 

913

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడనే కారణంగా డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ తర్వాత తుదిజట్టులో కూడా వార్నర్‌కి చోటు లేకుండా చేసింది..

1013

సొంత టీమ్ కంటే ఎక్కువగా అభిమానించే సన్‌రైజర్స్ హైదరాబాద్, కారణం కూడా చెప్పకుండా తనను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో డేవిడ్ వార్నర్ చాలా ఫీల్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తన బాధను బహిరంగంగా వ్యక్తం చేశాడు కూడా. 

1113

తాజాగా టీ20 వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ గెలిచిన తర్వాత డేవిడ్ వార్నర్ భార్య కాండీస్ వార్నర్ వేసిన ఓ ట్వీట్, పరోక్షంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఉద్దేశించి వేసినదే అంటున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్...

1213

‘అవుట్ ఆఫ్ ఫామ్... వయసైపోయింది... ఇంకా స్లో ఆడతావా... శుభాకాంక్షలు డేవిడ్ వార్నర్’... అంటూ నవ్వుతున్న ఎమోజీలను ట్వీట్ చేసింది కాండీస్ వార్నర్...

1313

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎదురైన చేదు అనుభవం కారణంగా వచ్చే సీజన్‌‌లో కొత్త జట్టు తరుపున ఆడతానని ప్రకటించాడు డేవిడ్ వార్నర్. నిలకడైన ప్రదర్శన ఇచ్చే వార్నర్ భాయ్ కోసం చాలా జట్లే పోటీ పడుతున్నాయి.

click me!

Recommended Stories