Arshdeep Singh
భువనేశ్వర్ కుమార్ పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ మెయింటైన్ చేస్తూ 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పెద్దగా అంచనాలు లేని అర్ష్‌దీప్ సింగ్ అయితే అద్భుతమే చేశాడు. పాక్ స్టార్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ ఆజమ్‌ని గోల్డెన్ డకౌట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్, ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్‌ని కూడా పెవిలియన్ చేరాడు...
తన మొదటి 3 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్, ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 14 పరుగులు సమర్పించాడు. మొత్తంగా 4 ఓవర్లలో 32 పరుగులిచ్చిన అర్ష్‌దీప్ సింగ్, 3 కీలక వికెట్లు తీసి భారత బౌలింగ్ యూనిట్‌కి స్టార్‌గా వెలిగాడు...
మహ్మద్ షమీ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి ఓ వికెట్ తీయగా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 30 పరుగులిచ్చాడు. స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 3 ఓవర్లలో 23 పరుగులు ఇవ్వగా అక్షర్ పటేల్ ఒకే ఓవర్ వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తానికి భారత బౌలర్ పర్ఫామెన్స్ బాగానే ఉంది...
Image credit: PTI
అయితే అసలు సమస్య టాపార్డర్‌లోనే. కెఎల్ రాహుల్ కీలక మ్యాచుల్లో ఫెయిల్ అవుతున్నాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ బ్యాటు నుంచి సరైన ఇన్నింగ్స్‌లు రావడం లేదు. సూర్యకుమార్ యాదవ్ మీద భారీ అంచనాలు పెట్టుకుంటే అతను కూడా నిరాశపరిచాడు...
Image credit: PTI
గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీతో పాటు రిషబ్ పంత్ రాణిస్తే, ఈసారి కూడా విరాట్ బ్యాటింగ్ భారాన్ని మోయాల్సి వచ్చింది. హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు... మొత్తానికి కీలక మ్యాచుల్లో భారత బ్యాటింగ్‌లోని డొల్లతనం బయటపడుతూనే ఉంది...
Rohit-Rahul
టీమిండియా తన తర్వాతి మ్యాచుల్లో నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో మ్యాచులు ఆడాల్సి ఉంది. పాక్ గండాన్ని దాటినా సౌతాఫ్రికాతో మ్యాచ్ చాలా కీలకం. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వేలను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు, అలసత్వం ప్రదర్శిస్తే షాక్ తప్పక పోవచ్చు...
మొత్తంగా మొదటి మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు అంచనాలకు మించి రాణించగా, స్పిన్నర్లకు పెద్దగా వర్కవుట్ కాలేదు. ఫీల్డింగ్‌లో మెరుపులు లేకపోయినా మరీ పేలవ ప్రదర్శన అయితే ఏమీ లేదు. బ్యాటింగ్‌లోనే టాపార్డర్ వైఫల్యం టీమిండియాని వెంటాడింది. ఆస్ట్రేలియా గడ్డపైన భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన ఇవ్వగలిగితేనే, 15 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలవాలనే భారత జట్టు ఆశలు నెరవేరతాయి.