pakistan
ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్, పాకిస్తాన్ టైటిల్ ఫెవరెట్లుగా బరిలో దిగితే ద్వైపాక్షిక సిరీసుల్లో వరుసగా విఫలమవుతూ వచ్చిన న్యూజిలాండ్.. అంచనాలు లేకుండా టోర్నీని ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 89 పరుగుల తేడాతో ఓడించి, షాక్ ఇచ్చింది న్యూజిలాండ్...
Trent Boult
గ్రూప్ స్టేజీలో 3 మ్యాచులు గెలిచి, ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా... ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ కారణంగా సెమీ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయిందంటే దానికి కారణం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన భారీ పరాజయమే....
ఆసియా కప్ 2022 విజేత శ్రీలంకపై 65 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడింది. ఆ తర్వాత ఐర్లాండ్‌పై 35 పరుగుల తేడాతో గెలిచి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది...
అయితే పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం న్యూజిలాండ్ ఆటతీరు క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్, 20 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి 59 పరుగులే చేసింది న్యూజిలాండ్...
ఫిన్ ఆలెన్, గ్లెన్ ఫిలిప్స్, డివాన్ కాన్వే అవుటైన తర్వాత బౌండరీలు రాబట్టడానికి తెగ ఇబ్బంది పడ్డారు న్యూజిలాండ్ బ్యాటర్లు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత న్యూజిలాండ్... టీ20 ఫార్మాట్‌కి సెట్ అవ్వడానికి బాగా ఇబ్బంది పడుతున్నట్టు కనిపించింది. గ్రూప్ స్టేజీల్లో దాన్ని మరిపించి, ఇరగదీసిన కివీస్.. సెమీ ఫైనల్‌లో మళ్లీ పాత సీన్‌నే రిపీట్ చేసింది...
డెత్ ఓవర్లలో న్యూజిలాండ్ బ్యాటర్లు బౌండరీలు బాదడానికి తెగ ఇబ్బంది పడ్డారు. 16 నుంచి 20 ఓవర్ల మధ్య న్యూజిలాండ్ బ్యాటర్లు కొట్టింది కేవలం రెండంటే రెండు ఫోర్లు... ఈ ఐదు ఓవర్లలో 46 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది కివీస్. భారీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుటైనా పెద్ద ఇబ్బందేమీ ఉండేది కాదు. కానీ జేమ్స్ నీశమ్, డార్ల్ మిచెల్, కేన్ విలియంసన్ వంటి సీనియర్లు కూడా సింగిల్స్, డబుల్స్ తీస్తే సరిపోతుందన్నట్టు బ్యాటింగ్ చేయడం అనుమానాలకు తావిస్తోంది...
NZ vs AUS
బ్యాటింగ్ నీరసంగా చేశారనుకుంటే, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మరింత ఘోరమైన పర్ఫామెన్స్ ఇచ్చింది న్యూజిలాండ్. చేతుల్లోకి వచ్చిన క్యాచులను నేలపాలు చేసిన ఫీల్డర్లు, ఈజీ రనౌట్ ఛాన్సులను కూడా మిస్ చేశారు. మొత్తానికి మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ ప్రదర్శన చూస్తుంటే... 2021లో టీమిండియా పర్ఫామెన్స్ గుర్తుకువచ్చింది చాలామందికి...
న్యూజిలాండ్‌కి ఫైనల్ ఫోబియా చాలా ఎక్కువ. 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తప్పితే 2015 వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీల్లో ఫైనల్ మ్యాచుల్లో ఈ రకమైన పూర్ పర్ఫామెన్సే ఇచ్చింది న్యూజిలాండ్. అయితే ఈసారి సెమీ ఫైనల్‌లోనే కళ్లు తేలేసింది...
Kane Williamson
టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్ ఆడిన కేన్ విలియంసన్‌తో పాటు పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోయిన ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, లూకీ ఫర్గూసన్ వంటి ఫాస్ట్ బౌలర్లు కూడా ఈ ఓటమికి బాధ్యులే. స్పిన్‌కి అనుకూలిస్తున్న పిచ్‌పై 6 ఓవర్ల వరకూ ఫాస్ట్ బౌలర్లనే కొనసాగించిన కేన్ విలియంసన్ కెప్టెన్సీ తప్పిదాలకు న్యూజిలాండ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది...
Kane Williamson
ఐసీసీ టోర్నీల్లో సౌతాఫ్రికాని బ్యాడ్ లక్ వెంటాడుతూ ఉంటుంది. అయితే న్యూజిలాండ్ కథ మాత్రం పూర్తిగా వేరు. ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్ వరకూ టాప్ క్లాస్ ఆటతీరు వస్తున్నా, ఆఖరి మెట్టుని ఎలా దాటాలో మాత్రం కివీస్‌కి ఇంకా తెలిసి రావడం లేదు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచినా అది వాతావరణం కలిసి రావడం, భారత జట్టును బ్యాడ్ లక్ వెంటాడడం వల్లేనని ఈ ఓటమితో రుజువు చేసుకుంది న్యూజిలాండ్...