ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మహేళ జయవర్థనే రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్థనే 31 ఇన్నింగ్స్‌ల్లో 1016 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ 23 ఇన్నింగ్స్‌ల్లోనే 1065 పరుగులు చేసి... టాప్‌లో నిలిచాడు...
‘రికార్డులు అనేవి ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ అవ్వాల్సిందే. ఎవరో ఒకరు నా రికార్డును బ్రేక్ చేస్తారని తెలుసు. అయితే అది విరాట్ కోహ్లీ అవ్వడం చాలా సంతోషాన్ని కలిగించింది. విరాట్... బ్రిలియెంట్ మేట్. కంగ్రాట్స్... నువ్వు ఎప్పటికీ వారియర్‌వే...
Image credit: Getty
ఫామ్ ఈజ్ టెంపరీరీ, క్లాస్ ఈజ్ పర్మినెంట్... వెల్ డన్ విరాట్...’ అంటూ వ్యాఖ్యానించాడు శ్రీలంక మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ హెడ్ కోచ్ మహేళ జయవర్థనే...
virat
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకి 184 పరుగుల భారీ స్కోరు అందించిన విరాట్ కోహ్లీ, ఈ ఎడిషన్‌లో రెండోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. మొత్తంగా ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో విరాట్‌కి ఇది 10వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అత్యధిక సార్లు ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు కోహ్లీ...
Image credit: Getty
మొత్తంగా విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 60వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సచిన్ టెండూల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచుల్లో 76 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిస్తే, విరాట్ కోహ్లీ 477 మ్యాచుల్లో 60 సార్లు ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. సనత్ జయసూర్య 58, జాక్వస్ కలీస్ 57 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచి సచిన్, కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు..
అంతేకాకుండా ఆస్ట్రేలియాలో 3350 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గానూ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియాలో 3300 పరుగులు చేస్తే, శ్రీలంకలో 2686 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఈ రికార్డులను తిరగరాశాడు...