రిషబ్ పంత్ వర్సెస్ దినేశ్ కార్తీక్! సెమీస్‌లో ఆడేదెవ్వరు? ఇంకా డిసైడ్ చేయని రోహిత్ శర్మ...

First Published Nov 9, 2022, 4:42 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ చేరినప్పటికీ ఓ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. గ్రూప్ మ్యాచుల్లో ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో దాదాపు ఒకే టీమ్‌ని కొనసాగించింది టీమిండియా. ఓ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ప్లేస్‌లో దీపక్ హుడా ఆడడం, మరో మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ ఆడడం తప్ప మార్పులేమీ కనిపించలేదు...
 

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో నాలుగు మ్యాచుల్లో మూడు సార్లు బ్యాటింగ్‌కి వచ్చిన దినేశ్ కార్తీక్, సింగిల్ డిజిట్ స్కోరును దాటలేకపోయాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కీలక సమయంలో స్టంపౌట్ అయిన దినేశ్ కార్తీక్, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లీతో సమన్వయ లోపం కారణంగా రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్‌ని పక్కనబెట్టి రిషబ్ పంత్‌ని ఆడించింది టీమిండియా...

Image credit: Getty

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగులకే అవుటై నిరాశపరిచాడు రిషబ్ పంత్. మరి సెమీ ఫైనల్‌లో ఈ ఇద్దరిలో ఎవరు ఆడతారు? రిషబ్ పంత్‌ని కొనసాగిస్తారా? లేక దినేశ్ కార్తీక్ తిరిగి జట్టులోకి వస్తాడా?

Dinesh Karthik

‘సెమీ ఫైనల్‌లో కూడా టీమ్‌లో మార్పులు చేయడం అవసరమతై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ మ్యాచ్‌లో అయినా ఆడడానికి సిద్ధంగా ఉండాలని ప్లేయర్లను మానసికంగా సిద్ధం చేశాం. సెమీ ఫైనల్‌లో స్పిన్నర్లను ఎదుర్కొవడానికి లెఫ్ట్ హ్యాండర్‌ని ఆడించాలని అనుకుంటున్నాం...

Image credit: PTI

అలాగని రిషబ్ పంత్‌నే ఆడతాడని పక్కాగా చెప్పలేం. ఇద్దరిలో ఎవ్వరైనా ఆడొచ్చు.ఇద్దరినీ సిద్ధంగా ఉండమని చెప్పాం...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ..

click me!