ఇంగ్లాండ్ నుంచి ఐపీఎల్ ఆడే క్రికెటర్లు తక్కువైనా, వారి ఫెయిల్యూర్‌ని ఎవ్వరిపైన తోయాలో తెలియక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని సాకుగా చెప్పుకొచ్చారు. అయితే ఐపీఎల్ వల్లే తాను స్టార్ క్రికెటర్‌గా మారానని అంటున్నాడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్...
Marcus Stoinis
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతుల్లో 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఆతిథ్య ఆస్ట్రేలియా, రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆసీస్...
డేవిడ్ వార్నర్ 11, మిచెల్ మార్ష్ 17, గ్లెన్ మ్యాక్స్‌లో 23 పరుగులు చేసి అవుట్ కావడం... ఆరోన్ ఫించ్ 42 బంతుల్లో 31 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియాకి మరో షాక్ తప్పదేమో అనుకున్నారందరూ. అయితే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మార్కస్ స్టోయినిస్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 పరుగులు చేసి సునామీ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ని ముగించాడు...
Image Credit: Getty Images
13వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ అవుటైన తర్వాత ఇంకా విజయానికి 69 పరుగులు కావాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్, 17వ ఓవర్‌లో మ్యాచ్‌ని ముగించేశాడు.
గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లోనూ ఆస్ట్రేలియాకి మ్యాచ విన్నర్‌గా మారిన స్టోయినిస్, తన సక్సెస్ క్రెడిట్ ఐపీఎల్‌కి ఇచ్చేశాడు. ‘ఐపీఎల్ వల్ల నా క్రికెట్ పూర్తిగా మారిపోయింది. ఆటలో ఎలా భాగం కావాలి, గేమ్‌ని ఎలా రీడ్ చేయాలనే విషయాలను ఐపీఎల్‌లో బాగా అర్థం చేసుకున్నా...
ఐపీఎల్ వల్ల అత్యంత కష్టమైన పిచ్‌ల మీద ఎలా ఆడాలో తెలియడమే కాదు, అత్యుత్తమ కోచ్‌లు, వరల్డ్ బెస్ట్ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం, వారి దగ్గరి నుంచి విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం దక్కింది...
నేను కొన్నేళ్లుగానే ఐపీఎల్ ఆడుతున్నా, చాలా తక్కువ టీమ్స్ తరుపునే ఆడా. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో వరల్డ్ బెస్ట్ ప్లేయర్లు ఉన్నప్పుడు వారి దగ్గరి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. స్పిన్ బౌలింగ్‌లో ఎలా ఆడాలో అక్కడే నేర్చుకున్నా... అదే నా ఆటను ఇలా మార్చేసింది...’ అంటూ కామెంట్ చేశాడు మార్కస్ స్టోయినిస్...
Marcus Stoinis
17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మార్కస్ స్టోయినిస్, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. యువరాజ్ సింగ్ 2007 వరల్డ్ కప్‌లో 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, 17 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న స్టోయినిస్, నెదర్లాండ్ క్రికెటర్ స్టీఫెన్ మైబర్గ్ రికార్డును సమం చేశాడు..