తాను ఎదుర్కొన్న మొదటి 24 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత 29 బంతుల్లో 67 పరుగులు చేసి టీమిండియాకి మరుపురాని విజయాన్ని అందించాడు. ఆఖరి 8 బంతుల్లో టీమిండియా విజయానికి 28 పరుగులు కావాల్సిన సమయంలో హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో కొట్టిన రెండు సిక్సర్లు... మ్యాచ్ మొత్తానికే హైలైట్..
Virat Kohli
‘10 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు మాత్రమే చేయగలిగాం. మూడో వికెట్ పడగానే నేను ప్యాడ్స్ కట్టుకుని రెఢీగా ఉన్నా. వికెట్లు త్వరగా పడితే త్వరగానే బ్యాటింగ్‌కి వెళ్లాల్సి ఉంటుందని రెఢీగా కూర్చున్నా... మ్యాచ్ ఎటు వెళ్తోంది...
Rohit lifts Kohli
10 ఓవర్లు ముగిసే సమయానికి 45 పరుగులే చేశాం. వాళ్లిద్దరూ చెరో 60 చేసినా ఆఖర్లో నేను వెళ్లి నా పాత్ర చేయాలని అనుకుంటూ ఉన్నా. నా ముందు రాహుల్ ద్రావిడ్ కూర్చున్నారు. దినేశ్ కార్తీక్ కూడా ప్యాడ్లు కట్టుకుని వచ్చాడు. ఆ చల్లని వాతావరణంలో నేను, దినేశ్ కార్తీక్ కాసేపు రన్నింగ్ చేశాం...
మ్యాచ్ సాగే కొద్దీ కూర్చీల నుంచి కదల్లేకపోయాం. విరాట్ ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు. అతని బ్యాటింగ్ చూస్తుంటే తనలోకి ఏదో ఆత్మ ఆవహించినట్టు అనిపించింది. గంగలా ఉన్నవాడు కాస్తా చంద్రముఖిలా మారిపోయాడు... ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులోకి వెళ్లా...
నేను బ్యాటింగ్‌కి రాగానే విరాట్ కోహ్లీ నాకెన్నో విషయాలు చెప్పాడు. నేనైతే ఒక్కటే అనుకున్నా.. ‘‘ఈరోజు నువ్వు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు, నీకోసం అయినా ఈ పరుగులు చేస్తా. నిన్ను ఓడిపోనివ్వను.. ’’ అని మనసులో అనుకున్నా. గ్యాప్‌లో బంతిని పంపితే చాలని అనుకున్నా...
ashwin
లెగ్ సైడ్ బాల్ వేసినప్పుడే వైడ్ వెళ్తుందని అర్థమైంది. అనవసరంగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అదనపు పరుగు వస్తుంటే రిస్క్ తీసుకోవడం ఎందుకు. అందుకే రిలాక్స్ అయిపోయా...
Image credit: Getty
ఆ తర్వాతి బంతికి షాట్ కొట్టగానే చాలా సంతోషం వేసింది. హమ్మయ్య.. ఇప్పుడు నా ఇంటిపైన ఎవ్వరూ రాళ్లు వేయరని అనుకున్నా... హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో అతని తల మీద నుంచి సిక్సర్ అయితే నేను కొట్టలేను. నేనేం చేయగలనో అది చేశాను... ’ అంటూ తన యూట్యూబ్ వీడియోలో వివరించాడు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్..