INDvsAUS: ఆస్ట్రేలియాకి ఊరట విజయం... విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం వృథా...

Published : Dec 08, 2020, 05:27 PM IST

INDvsAUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ టీ20 అభిమానులకి కావాల్సినంత మజాని అందించింది. భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా... చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ నుంచి ‘కింగ్’ రేంజ్ ఇన్నింగ్స్ చూసే అదృష్టం దక్కింది. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకోగా, టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. టీమిండియాకు టీ20ల్లో 11 మ్యాచుల తర్వాత ఇది తొలి ఓటమి కావడం విశేషం. 187 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులకి పరిమితమైంది. ఆసీస్‌కి 12 పరుగుల తేడాతో విజయం దక్కింది.

PREV
116
INDvsAUS: ఆస్ట్రేలియాకి ఊరట విజయం... విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం వృథా...

187 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకు మొదటి ఓవర్‌లో షాక్ ఇచ్చాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్...

216

మ్యాక్స్‌వెల్ ఓవర్‌లో రెండో బంతికే డకౌట్ అయ్యాడు కెఎల్ రాహుల్. నాలుగేళ్ల క్రితం 2016లో టీ20ల్లో తాను ఆడిన మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన రాహుల్, మళ్లీ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరడం ఇదే రెండోసారి...

316

శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాను ఆదుకున్నారు...

416

21 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన శిఖర్ ధావన్... స్వీప్సన్ బౌలింగ్‌లో డానియల్ సామ్స్ అద్భుతమైన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు.

516

ఆ తర్వాత 9 బంతుల్లో 10 పరుగులు చేసిన సంజూ శాంసన్... తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించి... స్వీప్సన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు...

616

అదే ఓవర్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ అయ్యాడు శ్రేయాస్ అయ్యర్. 100 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా...

716

హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ కలిసి బౌండరీలతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డారు...

816

టీ20ల్లో 25వ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న విరాట్ కోహ్లీ... ఈ ఏడాది ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో మొట్టమొదటి అర్ధశతకం నమోదుచేశాడు.

916

టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ... 

1016

రోహిత్ శర్మ 100 ఇన్నింగ్స్‌ల్లో 25 హాఫ్ సెంచరీలు బాదితే, విరాట్ కోహ్లీ 79 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు... 

1116

ఆస్ట్రేలియాపై 3000 పరుగులు కూడా పూర్తిచేసుకున్న విరాట్ కోహ్లీ... టీ20ల్లో 300 సిక్సర్లు పూర్తిచేసుకున్నాడు.

1216

ఆస్ట్రేలియాపై టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు విరాట్. విరాట్ కోహ్లీ 7సార్లు 50+స్కోరు చేస్తే, గేల్ 4 సార్లు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.

1316

చేధనలో 17వ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న విరాట్ కోహ్లీ... టాప్‌లో నిలిచాడు. 12 హాఫ్ సెంచరీలు చేసిన వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. 9 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ క్యాచ్ జారవిరచడంతో అవుట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు విరాట్.

1416

61 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 85 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆండ్రూ టై బౌలింగ్‌లో డానియల్ సామ్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

1516

13 బంతుల్లో ఓ ఫోరు, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా.. భారీ షాట్‌కి ప్రయత్నించి జంపా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
 
1616

ఆఖర్లో శార్దూల్ ఠాకూర్ 7 బంతుల్లో 2 సిక్సర్లతో 17 పరుగులు చేశాడు. అయితే అప్పటికే విజయానికి దూరమైంది టీమిండియా.

click me!

Recommended Stories