8 వికెట్లు... 309 పరుగులు... మూడు సెషన్లు... ఇదీ ఆఖరి రోజు సిడ్నీ టెస్టు లెక్క...

Published : Jan 10, 2021, 12:43 PM IST

సిడ్నీ వేదికగా జరుగుతున్న పింక్ టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 312/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, టీమిండియా ముందు 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో పాటు శుబ్‌మన్ గిల్ రాణించడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది టీమిండియా. భారత విజయలక్ష్యం ఆఖరి రోజు 309 పరుగులు కాగా, ఆస్ట్రేలియా గెలవాంటే మిగిలిన 8 వికెట్లు తీయాల్సి ఉంటుంది. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ అవుట్ కాకుండా ఉండి ఉంటే, టీమిండియా గెలుపుపై మరిన్ని ఆశలు ఉండేవి.

PREV
112
8 వికెట్లు... 309 పరుగులు... మూడు సెషన్లు... ఇదీ ఆఖరి రోజు సిడ్నీ టెస్టు లెక్క...

శుబ్‌మన్ గిల్ 64 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసి అవుట్ కాగా రోహిత్ శర్మ 98 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..

212

407 పరుగుల విజయ లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ కలిసి శుభారంభాన్ని అందించారు...

312

గిల్, రోహిత్ శర్మ కలిసి మొదటి వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటి ఇన్నింగ్స్‌లో 50+ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడి, 53 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఈ ఫీట్ సాధించిన మొదటి ఓపెనింగ్ జోడిగా నిలిచింది.

412

ఇంతకుముందు 1968లో సిడ్నీలో భారత జట్టు తరుపున ఈ విధంగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50+ ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదుకాగా... మళ్లీ ఇన్నాళ్లకు అది సాధ్యమైంది...

512

విదేశాల్లో ఈ విధంగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మొదటి వికెట్‌కి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం దక్కడం 15 ఏళ్లలో ఇదే తొలిసారి. 

612

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత ఓపెనింగ్ జోడి 20 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసింది. ఇంతకుముందు ఆఖరిసారిగా 2004లో వీరంద్ర సెహ్వాగ్, గంగూలీ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

712

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 50 సిక్సర్లు బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై 100 సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా నిలిచిన రోహిత్, రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 50 సిక్సర్లు పూర్తిచేసుకోవడం విశేషం.

812

నాలుగో ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ జోడి... ఆసీస్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన మూడో జోడిగా నిలిచింది. ఇంతకుముందు అబిద్ ఆలీ-ఇంజనీర్ 83 పరుగులు, సిద్దూ- శ్రీకాంత్ 82 పరుగులు జోడించారు.

912

రోహిత్ శర్మ విదేశాల్లో జరిగిన టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 20+ పరుగులు చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2015లో సిడ్నీలోనే ఈ ఫీట్ సాధించాడు రోహిత్ శర్మ.

1012

తన కెరీర్‌లో రోహిత్ శర్మ నాలుగో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా రోహిత్ ఈ ఫీట్ సాధించలేకపోయాడు. 

1112

ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్, రోహిత్ శర్మను అవుట్ చేయగా హజల్‌వుడ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు. పూజారా 9, రహానే 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

1212

సిడ్నీ టెస్టులో గెలవాలంటే భారత జట్టు ఆఖరి రోజున రేపు 309 పరుగులు చేయాల్సి ఉంటుంది. లేదా డ్రా చేసుకోవాలని భావిస్తే 95 ఓవర్ల పాటు ఆలౌట్ కాకుండా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా విజయానికి 8 వికెట్లు అవసరం. 
 
click me!

Recommended Stories