ఆ లెక్కన జస్ప్రిత్ బుమ్రాని ఇప్పట్లో ఆడించే ఉద్దేశం లేదా... రోహిత్ శర్మ వింత సమాధానం...

Published : Jan 25, 2023, 12:28 PM IST

గాయం కారణంగా ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలకు దూరమయ్యాడు జస్ప్రిత్ బుమ్రా. బుమ్రా ఉండి ఉంటే సీన్ ఎలా ఉండేదో తెలీదు కానీ ఈ రెండు టోర్నీల్లో టీమిండియా టైటిల్ గెలవకుండానే ఇంటిదారి పట్టింది...

PREV
17
ఆ లెక్కన జస్ప్రిత్ బుమ్రాని ఇప్పట్లో ఆడించే ఉద్దేశం లేదా... రోహిత్ శర్మ వింత సమాధానం...
Jasprit Bumrah

వెన్ను గాయంతో దాదాపు నాలుగు నెలల పాటు టీమ్‌‌‌కి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొంటాడని ప్రకటించింది బీసీసీఐ. బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకుని, మ్యాచ్ ఆడేందుకు కావాల్సిన ఫిట్‌నెస్ సాధించాడని అధికారిక ప్రకటన కూడా చేసింది...

27

అయితే ఆ తర్వాత మూడు రోజులకే జస్ప్రిత్ బుమ్రాకి ఇంకొన్ని రోజులు రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అతన్ని వన్డే సిరీస్ నుంచి తప్పిస్తున్నట్టు మరోసారి హడావుడి ప్రకటన చేసింది బీసీసీఐ. ఓ ఆటగాడి ఫిట్‌నెస్ విషయంలో ఈ మాత్రం అవగాహన లేకుండా బీసీసీఐ చేసిన ఈ పని, తీవ్ర విమర్శలకు దారి తీసింది...

37
Image credit: Getty

శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ని కూడా క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు. టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ మొదలవుతుంది. అయితే బుమ్రా, ఈ టెస్టు సిరీస్‌లో కూడా ఆడడం అనుమానమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

47
Jasprit Bumrah

‘జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌నెస్ గురించి నాకైతే పూర్తి సమాచారం లేదు. అతను తొలి రెండు టెస్టులు ఆడకపోయినా, చివరి రెండు మ్యాచులు ఆడతాడని మాత్రం అనుకుంటున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ చేయకూడదని మేం అనుకుంటున్నాం...

57
Image credit: Getty


ఈ ఏడాది టీమిండియాకి చాలా మ్యాచులు ఉన్నాయి. ఫిజియోలతో, డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. బుమ్రాకి కావాల్సినంత టైమ్ ఇవ్వాలని మెడికల్ టీమ్ సూచించింది. అందుకే అతన్ని తప్పించాం...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...

67
Image credit: Getty

గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని ప్రకటించి, వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జస్ప్రిత్ బుమ్రా... మళ్లీ కోలుకోవడానికి సమయం తీసుకుంటున్నాడని రోహిత్ శర్మ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో ఆఖరి స్థానంలో నిలిచింది...

77
Jasprit Bumrah and Pollard

గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని ప్రకటించి, వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జస్ప్రిత్ బుమ్రా... మళ్లీ కోలుకోవడానికి సమయం తీసుకుంటున్నాడని రోహిత్ శర్మ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో ఆఖరి స్థానంలో నిలిచింది...

Read more Photos on
click me!

Recommended Stories