ఆ టీమ్‌లోనే ఉండి ఉంటే, సూర్యకుమార్ కెరీర్‌ ఎప్పుడో ముగిసేది... రికీ పాంటింగ్ సెన్సేషనల్ కామెంట్...

Published : Sep 30, 2022, 12:36 PM IST

జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా గాయపడినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిలకడైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నా భారత జట్టుపై ఇంకా కొన్ని ఆశలు సజీవంగానే ఉన్నాయి. దీనికి కారణం సూర్యకుమార్ యాదవ్. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్...

PREV
18
ఆ టీమ్‌లోనే ఉండి ఉంటే, సూర్యకుమార్ కెరీర్‌ ఎప్పుడో ముగిసేది... రికీ పాంటింగ్ సెన్సేషనల్ కామెంట్...
Suryakumar Yadav

ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్, ఒకే ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు. నిలకడైన పర్పామెన్స్‌తో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 2లో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్, నెం.1 ప్లేస్‌కి చాలా చేరువగా ఉన్నాడు...

28
Image credit: Getty

సౌతాఫ్రికా, ఇండియా మధ్య తిరువనంతపురంలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టాప్ క్లాస్ బ్యాటర్లు అందరూ పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పిచ్ బాగాలేదని తెలుసుకున్న కెఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడి హాఫ్ సెంచరీ చేసుకున్నాడు...

38
Image credit: PTI

అయితే మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ మాత్రం పిచ్‌తో తనకేమీ సంబంధం లేదన్నట్టుగా బ్యాటింగ్ చేశాడు. వచ్చినప్పటి నుంచే బౌండరీలు బాదుతూ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి టీమిండియాకి అద్భుత విజయాన్ని అందించాడు...
 

48
Suryakumar Yadav

‘నేను ముంబై ఇండియన్స్‌లో ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్‌ 18-19 ఏళ్ల కుర్రాడు. చాలా చిన్నోడు. అతనికి జట్టులో చోటు రాలేదు. ఏడాది తర్వాత అతను కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ట్రేడ్ ద్వారా వెళ్లాడు. అక్కడే అతని కెరీర్ గ్రాఫ్ మలుపు తిరిగింది...

58
Image credit: PTI

ముంబై ఇండియన్స్‌లోనే ఉండి ఉంటే సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం వచ్చేది కాదు. ఎందుకంటే ముంబైలో టాప్ క్లాస్ ప్లేయర్లు పుష్కలంగా ఉన్నారు. ప్రతీ ప్లేస్‌కీ ఒకరిద్దరు స్టార్లు పోటీపడుతున్నారు. కేకేఆర్‌లోకి వెళ్లగానే అతనికి అవకాశాలు దక్కాయి..

68
Image credit: PTI

మిడిల్ ఆర్డర్‌లో ఆడిన సూర్యకుమార్ యాదవ్, తానేం చేయగలనో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ వేలం ద్వారా అతన్ని తిరిగి దక్కించుకుంది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ లాంటి మ్యాచ్ విన్నర్‌ని వేరే జట్టులోకి పంపించామని లేటుగా తెలుసుకుంది...

78
Image credit: Getty

ఇప్పుడు ముంబై ఇండియన్స్‌లో తరుపున సూర్య, ఐదారు సీజన్లుగా ఆడుతున్నాడు. అతన్ని రిటైన్ చేసుకుంటూ బయటికి పోకుండా కాపాడుకుంటోంది. సూర్యలో టన్నుల్లో టాలెంట్ ఉందని కుర్రాడిగా ఉన్నప్పుడే గమనించా...
 

88
Image credit: PTI

అతను మ్యాచ్ మ్యాచ్‌కి తనని తాను మరింత మెరుగుపరుచుకుంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్యాటింగ్ చేయగల ప్లేయర్లు చాలా అరుదుగా ఉంటారు. అతను వికెట్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆడడు, కేవలం పరుగులు చేయాలనే లక్ష్యంతోనే బ్యాటింగ్ చేస్తాడు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...

click me!

Recommended Stories