టాప్‌ లేపిన సూర్యకుమార్ యాదవ్.. ఇంకో హాఫ్ సెంచరీ కొడితే చాలు, వరల్డ్ రికార్డు బ్రేక్...

First Published Feb 1, 2023, 3:39 PM IST

సూర్య భాయ్.. ఇది పేరు కాదు! ఇట్స్ ఏ బ్రాండ్. టీ20ల్లో ఈ బ్రాండ్ చేస్తున్న రీసౌండ్ మామూలుగా లేదు. గత ఏడాది చివరన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 ప్లేస్‌ని దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్, తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు... 

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, రెండో టీ20లో 26 పరుగులు చేశాడు...

బ్యాటింగ్‌కి అత్యంత కష్టంగా మారిన లక్నో పిచ్‌లో 31 బంతుల్లో ఓ ఫోర్‌తో 26 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్‌కి ఇది 11వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు...
 

Image credit: PTI

ఈ రెండు ఇన్నింగ్స్‌ల కారణంగా సూర్యకుమార్ యాదవ్, ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 910 పాయింట్లకు చేరుకున్నాడు. ఇంతకుముందు టీమిండియా తరుపున టీ20ల్లో అత్యధిక రేటింగ్స్ దక్కించుకున్న ప్లేయర్‌ విరాట్ కోహ్లీ...

Virat Kohli-Suryakumar Yadav

విరాట్ కోహ్లీ 897 పాయింట్ల సాధించగా టీ20ల్లో 900+ పాయింట్లు సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. అయితే ఓవరాల్‌గా టీ20ల్లో 900+ రేటింగ్ పాయింట్లు తెచ్చుకున్న మూడో బ్యాటర్ సూర్య...

ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ 915 పాయింట్లతో టాప్‌లో ఉండే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 900 పాయింట్లు సాధించాడు. ఫించ్ రికార్డును లేపేసిన సూర్యకుమార్ యాదవ్, నేటి మ్యాచ్‌లో 30+ స్కోరు చేస్తే డేవిడ్ మలాన్ రికార్డును కూడా బ్రేక్ చేస్తాడు..

suryakumar

 మరో హాఫ్ సెంచరీ చేస్తే... టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ దక్కించుకున్న ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేస్తాడు సూర్యకుమార్ యాదవ్.  టెస్టుల్లో విరాట్ కోహ్లీ 937, వన్డేల్లో 911 రేటింగ్స్ సాధించి... టీమిండియా తరుపున అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన ప్లేయర్‌గా ఉన్నాడు. టీ20ల్లో ఈ రెండు రికార్డులను బ్రేక్ చేయాలంటే సూర్యకుమార్ యాదవ్, మరికొంత కాలం వేచి చూడాల్సిందే... 

click me!