ధోనీ రిటైర్మెంట్‌కి నెల రోజుల ముందే పంత్ ఇలా చెప్పాడు... సురేశ్ రైనా కామెంట్...

Published : Apr 10, 2021, 06:35 PM IST

క్రికెట్ వరల్డ్‌లో రెండు వరల్డ్‌కప్స్‌తో పాటు ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ స్థానానికి రిప్లేస్‌మెంట్‌గా ఎంపికయ్యాడు రిషబ్ పంత్. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న రిషబ్ పంత్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సురేశ్ రైనా...

PREV
112
ధోనీ రిటైర్మెంట్‌కి నెల రోజుల ముందే పంత్ ఇలా చెప్పాడు... సురేశ్ రైనా కామెంట్...

2020 ఐపీఎల్‌కి ముందు లాక్‌డౌన్ సమయంలో జూలైలో ఘజియాబాద్, ఢిల్లీ నగరాల్లో కలిసి శిక్షణ తీసుకున్నారు సీఎస్‌కే ప్లేయర్ సురేశ్ రైనా, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రిషబ్ పంత్...

212

ఆ సమయంలో రిషబ్ పంత్, తనతో మట్లాడిన విషయాల గురించి తాజాగా బయటపెట్టాడు ‘చిన్నతల’ సురేశ్ రైనా...

312

‘అప్పటికే రిషబ్ పంత్‌కి చాలా అవకాశాలు ఇచ్చింది టీమిండియా. అయితే చాలా మ్యాచుల్లో రిషబ్ పంత్ ఫెయిల్ అయ్యాడు. దీంతో టీమ్‌లో చోటు కోల్పోయాడు...

412

రిషబ్ పంత్‌లో చాలా టాలెంట్ ఉంది. భవిష్యత్తులో టీమిండియాకి అతనో గొప్ప ప్లేయర్ అవుతాడని నాకు తెలుసు... గత ఏడాది జూన్‌లో అతని ఫామ్ సరిగా లేదు...

512

టీమిండియాలో అతనికి వరుస అవకాశాలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ సమయంలో నా దగ్గరికి వచ్చి, తన మనసులో మాట బయటపెట్టాడు రిషబ్ పంత్...

612

‘‘భయ్యా... నేను ప్రపంచంలో బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కావాలని అనుకుంటున్నా... నాపై వస్తున్న విమర్శలన్నింటికీ నా ఆటతోనే సమాధానం చెప్పాలి’’ అంటూ చెప్పాడు పంత్...

712

ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. మహేంద్ర సింగ్ ధోనీకి రిప్లేస్‌మెంట్‌గా పంత్‌ను చూస్తుండడం అతను తట్టుకోలేకపోయాడు. అతను సొంత గుర్తింపు కోసం ఏం చేయాలో తెలియక సతమతమయ్యాడు...

812

జూన్‌లో మేం ట్రైనింగ్ ఇంకా మొదలెట్టలేదు. అయినా రిషబ్ పంత్ రోజూ మా ఇంటికి వచ్చేవాడు. మా పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. నా భార్యతో మాట్లాడేవాడు...

912

నెట్‌ఫ్లెక్స్‌లో నచ్చిన సినిమాలు చూసేవాడు. కావాల్సిన పుడ్‌ను అడిగి మరీ తెప్పించుకునేవాడు... మేం ఇద్దరం కలిసి సిటీలో రౌండ్స్‌కి కూడా వెళ్లేవాళ్లం...’ అంటూ చెప్పుకొచ్చాడు సురేశ్ రైనా...

1012

‘ఇప్పుడు రిషబ్ పంత్ టీమిండియాకి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఢిల్లీకి కూడా పరుగులు చేస్తున్నాడు. తన ప్రతిభను వాడి, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకుంటాడని నమ్మకం ఉంది...’ అంటూ వివరించాడు రైనా...

1112

2020 సీజన్ ఆరంభానికి ముందు ఆగస్టు 15న ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే, అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు సురేశ్ రైనా...

1212

‘సురేశ్ రైనా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కావడంతో నేను ఆయన్ని అన్నలా భావించేవాడిని... ఎంతో అనుభవం ఉన్న సురేశ్ రైనా నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను...’ అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్...

click me!

Recommended Stories