ధోనీ తప్పేం లేదు! నా బదులు అతన్ని ఆడించమని నేనే చెప్పా... బాంబ్ పేల్చిన సురేష్ రైనా...

First Published Jun 17, 2023, 12:42 PM IST

చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు ఐపీఎల్ టైటిల్స్ అందించిన క్రికెటర్ సురేష్ రైనా. టీమిండియా తరుపున రాణించింది తక్కువే అయినా ఐపీఎల్‌లో సీఎస్‌కే తరుపున అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చిన రైనా, ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు..
 

వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ నుంచి సురేష్ రైనా తప్పుకున్నాడు. సీజన్ ఆరంభానికి ముందు తన మామ ఇంటికి దోపిడి దొంగలు దాడి చేయడంతో రైనా స్వదేశానికి వచ్చేశాడు, తిరిగి యూఏఈ వెళ్లలేదు..
 

సురేష్ రైనా లేకుండా ఆడిన 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా చెత్త రికార్డు మూటకట్టుకుంది. ఆ తర్వాత తిరిగి ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎస్‌కేలో కలిశాడు సురేష్ రైనా...

అయితే బ్యాటుతో పెద్దగా రాణించలేకపోయిన సురేష్ రైనా, షార్ట్ బాల్స్ ఫేస్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ కారణంగానే ప్లేఆఫ్స్ మ్యాచుల్లో సురేష్ రైనాకి చోటు దక్కలేదు. ఆ తర్వాత ఐపీఎల్ 2022 వేలంలో రైనాని కొనుగోలు కూడా చేయలేదు చెన్నై సూపర్ కింగ్స్...
 

ఐపీఎల్ 2021 ప్లేఆఫ్స్‌లో సురేష్ రైనాని తప్పించి, రాబిన్ ఊతప్పని ఆడించింది చెన్నై సూపర్ కింగ్స్. ప్లేఆఫ్స్‌లో అదరగొట్టిన రాబిన్ ఊతప్ప, టీమ్‌ని ఫైనల్ చేర్చాడు. నాలుగో టైటిల్ రావడంలో తనవంతు పాత్ర పోషించాడు...

‘నిజానికి మాహీకి రాబిన్ ఊతప్పని ట్రై చేయమని సలహా ఇచ్చింది నేనే. మేమిద్దం కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో దీని గురించి చర్చ వచ్చింది. ఊతప్పని ఆడించే ముందు మాహీ నా పర్మిషన్ కూడా అడిగాడు..

Robin Uthappa

నాకు రాబిన్ ఊతప్ప టాలెంట్‌పైన పూర్తి నమ్మకం ఉంది. అందుకే అతన్ని ఆడించే కచ్ఛితంగా గెలిపిస్తాడని మాహీకి చెప్పాను.. ధోనీ చాలా ఎమోషనల్. 

‘‘మనం 2008 నుంచి కలిసి ఆడుతున్నాం కానీ ఈసారి ఈ సీజన్ గెలవాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పు నన్ను ఏం చేయమంటావో’’ అని మాహీ నాతో అన్నాడు... నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు...

టీమ్ కంటే వ్యక్తి ముఖ్యం కాదు, కాకూడదు. అందుకే నేను ‘‘నా బదలు రాబిన్ ఊతప్పని ఆడించండి. గెలిచినా గెలవకపోయినా అతను తుది జట్టులో కచ్ఛితంగా ఉండాలి. నువ్వు గెలిస్తే సీఎస్‌కే గెలుస్తుంది..

Photo source- Instagram

నేను ఆడినా, లేక రాబిన్ ఊతప్ప ఆడినా నాకేం అభ్యంతరం లేదు. ఇద్దరం ఒకటే... ’’ అని మాహీకి చెప్పాను. మాహీ కూడా వెంటనే ఒప్పుకున్నాడు... అందులో అతని తప్పేం లేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు సురేష్ రైనా.. 

click me!