Published : Jun 17, 2023, 11:46 AM ISTUpdated : Jun 17, 2023, 12:09 PM IST
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత టీమిండియాకి నెల రోజుల బ్రేక్ దొరికింది. అయినా వెస్టిండీస్ టూర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదని, రెస్ట్ తీసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి...
రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీపై సంతృప్తి చెందని టీమిండియా సెలక్టర్లు, వచ్చే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నాటికి అతను అందుబాటులో ఉండడం కష్టమేనని క్లారిటీకి వచ్చేశారు...
29
అందుకే వెస్టిండీస్ టూర్ నుంచి కొత్త కెప్టెన్‌కి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. విండీస్ టూర్‌లో టెస్టులకు రోహిత్ శర్మనే కెప్టెన్సీ చేస్తాడని, ఆ తర్వాత ఐదు నెలల దాకా టీమిండియా టెస్టులు ఆడకపోవడంతో కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేయడానికి బీసీసీఐకి కావాల్సినంత సమయం ఉంటుందని వార్తలు వచ్చాయి...
39
డిసెంబర్ 2023లో సౌతాఫ్రికా టూర్‌కి వెళ్తోంది టీమిండియా. సఫారీ గడ్డ మీద భారత జట్టు ఇప్పటిదాకా టెస్టు సిరీస్ గెలిచింది లేదు. గత పర్యటనలో కూడా తొలి టెస్టు విజయం తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో ఓడి 2-1 తేడాతో సిరీస్ కోల్పోయింది..
49
అందుకే వెస్టిండీస్ టూర్ నుంచి కొత్త కెప్టెన్‌ని పరీక్షిస్తే బాగుంటుందని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారట. మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్న యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు దక్కవచ్చని టాక్ వినబడుతోంది..
59
Shubman Gill
గత ఏడాది రోహిత్ శర్మ అందుబాటులో లేని టెస్టు మ్యాచులకు కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్లుగా వ్యవహరించారు. అయితే ఈ ఇద్దరూ ప్రస్తుతం గాయాలతో సతమతమవుతున్నారు. రిషబ్ పంత్ కూడా యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి జట్టుకి దూరమయ్యాడు..
69
Shubman Gill-Virat Kohli
టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్లుగా భావించిన ఈ ముగ్గురూ టీమ్‌కి దూరం కావడంతో అండర్19 వరల్డ్ కప్ 2018 టోర్నీకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన శుబ్‌మన్ గిల్‌కి భారత జట్టు టెస్టు కెప్టెన్సీ దక్కవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి...
79
అయితే విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే వంటి సీనియర్లతో నిండిన టీమ్‌ని, అదీ సుదీర్ఘ ఫార్మాట్‌లో నడిపించడమంటే అంత తేలికైన విషయం కాదు...
89
టెస్టు కెప్టెన్సీ శుబ్‌మన్ గిల్‌కి అదనపు భారం కావచ్చు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ, ఆ బాధ్యతలు అందుకున్నాడు. ధోనీకి కూడా సాధ్యంకాని విజయాలు అందుకుని, మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్‌గా నిలిచాడు..
99
శుబ్‌మన్ గిల్‌లో కూడా అలాంటి స్కిల్స్ ఉన్నాయని భావిస్తోందట బీసీసీఐ. అందుకే అశ్విన్,జడేజా వంటి సీనియర్లకు కెప్టెన్సీ ఇచ్చి, రెండు మూడేళ్ల తర్వాత మళ్లీ ఇంకో కొత్త కెప్టెన్‌ని వెతుక్కునే కంటే గిల్‌కి ఇవ్వడమే సరైన నిర్ణయం అవుతుందని సెలక్టర్లు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి..