కరోనా బాధితుల సహాయార్థం రూ.30 కోట్లు విరాళంగా ప్రకటించిన సన్‌రైజర్స్, సన్‌టీవీ...

First Published May 10, 2021, 1:09 PM IST

దేశంలో పెరుగుతున్న కరోనా బాధితుల సహాయార్థం సన్‌రైజర్స్ హైదరాబాద్, సన్‌టీవీ నెట్‌వర్క్ ముందుకొచ్చింది. కరోనా సెకండ్ వేవ్ బాధితుల సహాయంగా ఏకంగా రూ.30 కోట్లు విరాళంగా ప్రకటించింది ఆరెంజ్ ఆర్మీ...

సన్‌టీవీ నెట్‌వర్క్ కోవిద్-19 సెకండ్ వేవ్ విపత్తు బాధితుల సహాయార్థం రూ.30 కోట్లు విరాళంగా ప్రకటిస్తోంది. ఈ మొత్తాన్ని దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా బాధితుల సహాయార్థం వినియోగించబోతున్నాం...
undefined
కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మొత్తాన్ని అందచేస్తాం. అలాగే స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు, మందులు అందిస్తాం...
undefined
అంతేకాకుండా సన్‌నెట్‌వర్క్ మీడియా వనరుల ద్వారా జనాలకు అవగాహన కల్పిస్తాం... అంటూ ప్రకటన విడుదల చేసింది సన్‌టీవీ నెట్‌వర్క్...
undefined
కరోనా బాధితుల సహాయార్థం ఇప్పటివరకూ రాజస్థాన్ రాయల్స్ మిలియన్ డాలర్లు (రూ.7.5 కోట్లు) సాయం ప్రకటించగా... చెన్నై సూపర్ కింగ్స్ 450 ఆక్సిజన్ కంన్సేటేటర్లు (దాదాపు రూ.22.5 లక్షలు) అందచేసింది. వీటితో పోలిస్తే సన్‌నెట్‌వర్క్ చేసిన సాయం చాలా ఎక్కువే.
undefined
ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ తర్వాత టీమ్‌లో నుంచి తప్పించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, తాజా విరాళంతో అభిమానుల మనసు గెలుచుకుంది...
undefined
click me!