నా జీవితంలో ఇలాంటి ఇన్నింగ్స్ నేనెప్పుడూ చూడలేదు... సన్‌రైజర్స్ కోచ్ బ్రియాన్ లారా...

Published : Apr 10, 2023, 04:23 PM ISTUpdated : Apr 10, 2023, 04:25 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రెండో ఆదివారం (ఏప్పిల్ 9న) జరిగిన రెండు మ్యాచులు క్రికెట్ ఫ్యాన్స్‌కి మంచి మజాని అందించాయి. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రింకూ సింగ్ ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాది మ్యాచ్‌ని గెలిపిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచి, చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు శిఖర్ ధావన్..

PREV
18
నా జీవితంలో ఇలాంటి ఇన్నింగ్స్ నేనెప్పుడూ చూడలేదు... సన్‌రైజర్స్ కోచ్ బ్రియాన్ లారా...
(PTI Photo) (PTI04_05_2023_000367B)

ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన శిఖర్ ధావన్, 10 మంది బ్యాటర్లతో కలిసి బ్యాటింగ్ చేశాడు. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టు పెవిలియన్‌కి క్యూ కడుతున్నా మరో ఎండ్‌లో పాతుకుపోయిన శిఖర్ ధావన్ 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...

28

ఐపీఎల్ చరిత్రలో 90+ స్కోరు చేసి నాటౌట్‌గా నిలవడం శిఖర్ ధావన్‌కి ఇది నాలుగోసారి. అవుటైన వాటితో కలిసి కూడితే శిఖర్ ధావన్ ధావన్, తృటిలో మిస్ చేసుకున్న సెంచరీల సంఖ్య క్రిస్ గేల్ సెంచరీల కంటే ఎక్కువే. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో సామ్ కుర్రాన్ (22 పరుగులు) తప్ప మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయారు...
 

38

15వ ఓవర్ ఆఖరి బంతికి 9వ వికెట్ పడగా, చివరి 5 ఓవర్లలో 28 బంతులు ఎదుర్కొన్నాడు శిఖర్ ధావన్. 11వ వికెట్‌గా క్రీజులోకి వచ్చిన మోహిత్ రతే ఆడి 2 బంతులు కాగా చేసింది ఒకే ఒక్క పరుగు. అతనితో కలిసి 10వ వికెట్‌కి 55 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు శిఖర్ ధావన్..

48
(PTI Photo/Kamal Kishore) (PTI04_01_2023_000136B)

ఈ ఇన్నింగ్స్‌పై వెస్టిండీస్ మాజీ బ్యాటింగ్ దిగ్గజం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత కోచ్ బ్రియాన్ లారా, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ అద్భుతం. టీ20 క్రికెట్‌లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇది. అతను స్ట్రైయిక్ తీసుకున్న విధానం చూసి, చివరి 5 ఓవర్లు ఆడిన విధానం అసాధారణం..

58

గేమ్ మొత్తం తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. అతను లేకపోతే పంజాబ్ ఇన్నింగ్స్ ఎప్పుడో ముగిసిపోయి ఉండేది. ఇంత స్కోరు చేస్తారని అస్సలు అనుకోలేదు.. ’ అంటూ కామెంట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ బ్రియాన్ లారా...

68
Image credit: PTI

‘శిఖర్ ధావన్ ఏ టీమ్‌లో ఉన్నా, ఆ టీమ్‌ కోసం నూటికి 200 శాతం కష్టపడతాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో అతను నిలబడి చేసిన పరుగులు ఎంతో విలువైనది. ధావన్ బ్యాటింగ్ చాలా సింపుల్‌గా అనిపిస్తున్నా, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి ఆ పరుగులు చేశాడు.

78
Image credit: PTI

శిఖర్ ధావన్ 90+ స్కోరు చేసిన తర్వాత సెంచరీ పూర్తి చేసుకోవాలని కోరుకున్నా. ఇలాంటి ఇన్నింగ్స్ తర్వాత సెంచరీ వస్తే ఆ ఫీలింగ్ చాలా హైలో ఉంటుంది. అయితే ఈ 99 పరుగులు, సెంచరీ కంటే ఎక్కువే...’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్...
 

88
Image credit: PTI

144 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది సన్‌రైజర్స్ హైదరాబాద్.  హారీ బ్రూక్ 13, మయాంక్ అగర్వాల్ 21 పరుగులు చేసి అవుటైనా రాహుల్ త్రిపాఠి 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు, కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ 21 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు.. 

click me!

Recommended Stories