ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా టీమిండియాలోకి వచ్చి, ఒకే ఒక్క సిరీస్‌లో మూడు ఫార్మాట్లలోనూ అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి రికార్డు క్రియేట్ చేసిన బౌలర్ టి నటరాజన్. టీమిండియాకి లక్కీ బౌలర్‌గా మారిన నట్టూ ఉరఫ్ నటరాజన్... దాదాపు ఏడాదిన్నర గాయాలతో సతమతమవుతున్నాడు...
ఐపీఎల్ 2020 తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికైన వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో యార్కర్ల కింగ్ నటరాజన్‌కి అవకాశం దక్కింది...
29
టీ20 సిరీస్‌కి ఎంపికైన నటరాజన్... వన్డే సిరీస్‌లో నవ్‌దీప్ సైనీ ఫెయిల్ కావడంతో ఆ స్థానంలో మూడో వన్డేలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత టీ20 సిరీస్, కీ ప్లేయర్లు గాయపడడంతో బ్రిస్బేన్ టెస్టు కూడా ఆడేశాడు...
39
అయితే ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత గాయపడిన నటరాజన్... శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌కి అందుబాటులో రాలేదు...
49
ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ సమయానికి నట్టూ గాయం నుంచి కోలుకున్నప్పటికీ... కరోనా పాజిటివ్‌గా తేలడంతో మ్యాచులు ఆడలేకపోయాడు.
59
ఐపీఎల్ 2022 మెగా వేలంలో టి నటరాజన్‌ను రూ.4 కోట్లకు తిరిగి దక్కించుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇప్పటికే ఆరెంజ్ ఆర్మీ క్యాంపులో చేరిన నట్టూ, నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు...
69
తన స్టైల్ ఆఫ్ యార్కర్‌తో వికెట్‌ను విరగొట్టేశాడు నటరాజన్. దీంతో ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కొద్దికొద్దిగా అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి...
79
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా సఫారీ స్పీడ్ స్టార్ డేల్ స్టెయిన్‌ని నియమించిన విషయం తెలిసిందే.
89
దీంతో డేల్ స్టెయిన్ సారథ్యంలో నటరాజన్, భువనేశ్వర్ కుమార్... మరింత రాటుతేలి, టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు...
99
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా మార్చి 29న రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ తర్వాత ఏప్రిల్ 4న లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 9న చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచులు ఆడనుంది ఆరెంజ్ ఆర్మీ...