కోహ్లీ, జో రూట్, విలియంసన్, బాబర్... ఆ నలుగురి సక్సెస్ సీక్రెట్ ఇదే అంటున్న ప్యాట్ కమ్మిన్స్...

Published : Mar 22, 2022, 09:25 AM IST

బ్యాటర్ల రాజ్యం కొనసాగే క్రికెట్‌లో ఓ ఫాస్ట్ బౌలర్ కెప్టెన్సీ బాధ్యతలు చాలా గొప్ప విషయమే. వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ టిమ్ పైన్ సెక్స్ ఛాట్ వివాదాలతో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని తీసుకున్నాడు స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్...

PREV
110
కోహ్లీ, జో రూట్, విలియంసన్, బాబర్... ఆ నలుగురి సక్సెస్ సీక్రెట్ ఇదే అంటున్న ప్యాట్ కమ్మిన్స్...

ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో యాషెస్ సిరీస్ ఆడిన ఆస్ట్రేలియా, స్వదేశంలో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించి 4-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది... ప్రస్తుతం పాకిస్తాన్‌లో పర్యటిస్తోంది ఆసీస్...

210

28 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు... మొదటి రెండు టెస్టులను డ్రాగా ముగించింది. పేలవ పిచ్‌ల కారణంగా పాక్, ఆస్ట్రేలియా టెస్టులు ఐదు రోజుల పాటు సాగినా రిజల్ట్ రావడం లేదు...

310

రెండో టెస్టులో విజయం అంచుల్లో నిలిచిన ఆస్ట్రేలియాను పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 196 పరుగులతో రాణించి... అడ్డుకున్నాడు. మహ్మద్ రిజ్వాన్ సెంచరీ చేయడంతో ఆ మ్యాచ్ కాస్తా డ్రాగా ముగిసింది..

410

తాజాగా ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో టాప్ ప్లేయర్లుగా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియంసన్, బాబర్ ఆజమ్‌ల గురించి తన అభిప్రాయం తెలిపాడు ప్యాట్ కమ్మిన్స్...

510

‘నా దృష్టిలో ఆ నలుగురి ఆటతీరు ఒకేలా ఉంటుంది. సింగిల్స్ వేగంగా తీయగలరు. అవసరమైనప్పుడు బౌండరీలు కొట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలరు.

610

వీళ్లకి ఆట గురించి పూర్తి అవగాహన ఉంది, అందుకే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒత్తిడికి గురయ్యారు. అదీ కాకుండా సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు... 

710

బౌలర్లు చేసిన చిన్న తప్పులను ఎలా వాడుకోవాలో విరాట్‌ కోహ్లీతో పాటు కేన్ విలియంసన్, జో రూట్, బాబర్ ఆజమ్‌లకు బాగా తెలుసు... 

810

మొదటి బంతి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆలోచనతో అడుగుపెడతారు. విరాట్ కోహ్లీతో బాబర్ ఆజమ్‌ను పోల్చడం సరికాదనే నా అభిప్రాయం. అయితే ఇద్దరూ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారు...

910

ఛాలెంజ్‌లు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఇద్దరూ హై క్వాలిటీ ప్లేయర్లు. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ ఇద్దరూ... ఆస్ట్రేలియాపై భారీ సెంచరీలు చేశారు...’ అంటూ కామెంట్ చేశాడు ప్యాట్ కమ్మిన్స్...

1010

లాహోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఉస్మాన్ ఖవాజా 91 పరుగులు చేసి అవుట్ కాగా స్టీవ్ స్మిత్ 59 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు..

Read more Photos on
click me!

Recommended Stories