టీమిండియాకి ఆడకపోయినా, అది ఉందిగా! అందుకే ఇలా ఆడుతున్నారు... కుర్రాళ్ల ఆటపై సునీల్ గవాస్కర్...

First Published Jan 25, 2023, 1:51 PM IST

వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టడం ఇంత తేలికా? అనేది టీమిండియా కుర్ర క్రికెటర్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ రికార్డు ఫీట్‌లు సాధించారు. ఇషాన్ కిషన్, బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ కొట్టినప్పుడు ఆశ్చర్యపోయిన టీమిండియా ఫ్యాన్స్... శుబ్‌మన్ గిల్, న్యూజిలాండ్‌పై ద్విశతకం బాదడంతో డబుల్ హ్యాపీనెస్‌లో మునిగిపోయారు...

ishan

అత్యంత వేగంగా వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తే... అతి పిన్న వయసులో వన్డేల్లో ద్విశతకం బాదిన బ్యాట్స్‌మెన్‌గా శుబ్‌మన్ గిల్ చరిత్ర లిఖించాడు...

Image credit: PTI

‘వన్డేల్లో ఇద్దరు కుర్రాళ్లు, ఒకే నెలలో రెండు డబుల్ సెంచరీలు చేయడం చూసి నా మనసు నిండిపోయింది. ఈ ఇద్దరూ ఎంతో ఆత్మవిశ్వాసంతో బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపిస్తూ డబుల్ సెంచరీలు సాధించారు. వారికి  మంచి భవిష్యత్తు ఉంది...

Image credit: PTI

ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ కూడా 20ల్లో ఉన్నవాళ్లే. వారికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అయితే డబుల్ సెంచరీ కొట్టేశాం... మాకు తిరుగులేదు! అనే గర్వాన్ని బుర్రలో ఎక్కించుకోకూడదు. ఆ ఇన్నింగ్స్‌ని మరిచిపోని, ప్రతీ మ్యాచ్‌ని కొత్తగా ప్రారంభించాలి.. అప్పుడే సక్సెస్ సాధించగలుగుతారు...
 

ఇప్పటి కుర్రాళ్లు సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారు. ఇది చాలా మంచి విషయం. వారికి జట్టు నుంచి తీసివేస్తారనే భయం లేదు. దీనికి కారణం ఐపీఎల్‌ కాంట్రాక్టే. బాగా ఆడకపోతే టీమ్ నుంచి తీసేస్తారు, అయితే ఏమైంది ఐపీఎల్ ఉందిగా...

Image credit: PTI

ఐపీఎల్‌లో బాగా ఆడితే, మళ్లీ టీమ్‌లోకి రావచ్చు. టీమ్‌లోకి రాకపోయినా ఐపీఎల్‌లో ఆడుకోవచ్చు. అందుకే ఇప్పుడు క్రికెట్‌ని స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు. మా టైమ్‌లో ఇలా ఉండేది కాదు. ఒకటి రెండు మ్యాచుల్లో ఆడకపోతే జట్టులో నుంచి తీసేస్తారేమో అనే భయం వెంటాడుతూ ఉండేది..

Image credit: PTI

ఆ భయం కారణంగా బాగా ఆడాలని మరింత ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాళ్లం. ఇప్పటి తరం కుర్రాళ్లకు ఆ అవసరం లేదు. వారికి ఒకటికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో 14 మ్యాచులు ఉన్నాయి. వాటిల్లో కొన్నింట్లో బాగా ఆడినా తిరిగా భారత జట్టులోకి వచ్చేయొచ్చనే బిందాస్ క్రికెట్ వారి నరనరాల్లో నాటుకుపోయింది...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. 

click me!