మేం ఆడింది ఎక్కువ, వచ్చింది తక్కువ! ఖర్చులకు డబ్బులు ఇచ్చినట్టుగా... సౌరవ్ గంగూలీ కామెంట్...

Published : Jun 17, 2022, 12:18 PM IST

ఐపీఎల్ 2023-27 మీడియా ప్రసార హక్కుల విక్రయం ద్వారా రూ.48 వేల కోట్లు ఆర్జించింది భారత క్రికెట్ బోర్డు. టికెట్ విక్రయాలు, ఐసీసీ టోర్నీలు, మిగిలిన ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారా వచ్చే ఆదాయం అదనం. ఖజానాలో వేల కోట్లు చేరడంతో భారత మాజీ క్రికెటర్లకు చెల్లించే పెన్షన్‌ని 75 నుంచి 100 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది బోర్డు...

PREV
16
మేం ఆడింది ఎక్కువ, వచ్చింది తక్కువ! ఖర్చులకు డబ్బులు ఇచ్చినట్టుగా... సౌరవ్ గంగూలీ కామెంట్...

సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ ప్లస్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్లేయర్లకు ఏటా రూ.7 కోట్లు చెల్లిస్తోంది భారత క్రికెట్ బోర్డు. ఏ కేటగిరి ప్లేయర్లకు రూ.5 కోట్లు, బీ కేటగిరికి రూ.3 కోట్లు, సీ కేటగిరి ప్లేయర్లకు రూ.1 కోటి అందిస్తోంది...

26
Image credit: Getty

మ్యాచ్ ఫీజు, అవార్డులు, రివార్డులు, బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా వచ్చే వేతనాలు అదనం. ఓ స్టార్ హీరోలు సంపాదించే మొత్తంతో సమానంగా క్రికెటర్లు కూడా ఆదాయాన్ని రెండు చేతులా ఆర్జిస్తున్నారు...

36

‘డబ్బుకీ, పర్ఫామెన్స్‌కీ సంబంధం లేదు. సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, నా వరకూ... మేం ఎవ్వరం పెద్దగా సంపాదించలేదు. మా టైమ్‌లో ఆడేది ఎక్కువ, వచ్చేది తక్కువ అన్నట్టుగా ఉండేది...

46
Image credit: PTI

అయితే ఎంత ఇస్తున్నారు? అనేది మేమెప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడూ బాగా ఆడాలనే ఆలోచనే ఉండేది. ఇప్పుడు ఐపీఎల్ మెగా డీల్‌గా మారింది. ఐపీఎల్ వల్ల ఏ టోర్నీలకు ఆటంకం, అంతరాయం కలగదు...

56

ఎందుకంటే ఐపీఎల్ అనేది కేవలం ఇండియన్ టోర్నీ మాత్రమే. దీనితో సంబంధం లేకుండా ద్వైపాక్షిక సిరీస్‌లు జరుపుకోవాలంటే జరుపుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు... వచ్చే రెండేళ్లు కూడా ఐపీఎల్ 74 మ్యాచులుగా సాగుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..

66

1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకి మ్యాచ్ ఫీజు, అలవెన్సులు రెండూ కలిపి రూ.2100లను చెల్లించింది బీసీసీఐ. ఇప్పుడు రంజీ మ్యాచ్ ఆడిన ప్లేయర్లకు ఒక్క రోజుకీ ఇంతకు పదింతలు చెల్లిస్తోంది బీసీసీఐ... 

click me!

Recommended Stories