ఆ భయంతోనే రిటైర్మెంట్ తీసుకున్నా! లేకపోతే ఇంకో రెండు మూడేళ్లు ఆడే వాడిని... స్టువర్ట్ బ్రాడ్ కామెంట్స్..

Published : Aug 14, 2023, 04:13 PM IST

600లకు పైగా అంతర్జాతీయ టెస్టు వికెట్లు తీసిన రెండో పేసర్‌గా రికార్డు క్రియేట్ చేసిన స్టువర్ట్ బ్రాడ్, యాషెస్ సిరీస్ 2023 ఆఖరి టెస్టు తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన సీనియర్ జేమ్స్ అండర్సన్ ఇంకా కొనసాగుతున్నా, తాను రిటైర్ అవ్వడానికి కారణాన్ని బయటపెట్టాడు స్టువర్ట్ బ్రాడ్..

PREV
16
ఆ భయంతోనే రిటైర్మెంట్ తీసుకున్నా! లేకపోతే ఇంకో రెండు మూడేళ్లు ఆడే వాడిని... స్టువర్ట్ బ్రాడ్ కామెంట్స్..
Stuart Broad

167 టెస్టులు ఆడిన స్టువర్ట్ బ్రాడ్, 604 వికెట్లు తీశాడు. తన ఆఖరి టెస్టులో ఆడిన ఆఖరి బంతికి సిక్సర్ బాదిన స్టువర్ట్ బ్రాడ్, తన అంతర్జాతీ కెరీర్‌లో వేసిన ఆఖరి బంతికి వికెట్ పడగొట్టాడు..

26

తాజాగా ఏబీ డివిల్లియర్స్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు స్టువర్ట్ బ్రాడ్... ‘రిటైర్మెంట్ అనేది నా కెరీర్‌లో తీసుకున్న అతి కష్టమైన నిర్ణయాల్లో ఒకటి..

36
Stuart Broad

నేను ఇంకా ఆటను నూటికి నూరు శాతం ప్రేమిస్తున్నా. ఇంకో రెండు మూడేళ్లు ఆడగల సామర్థ్యం, శక్తి నాలో ఉన్నాయి. అయితే కెరీర్‌ని ఘనంగా టాప్ లెవెల్‌లో ముగించాలని కోరుకున్నా.. యాషెస్ సిరీస్‌లో నా పర్పామెన్స్‌ సంతృప్తినిచ్చింది. రిటైర్మెంట్‌కి ఇదే సరైన సమయమని అనిపించింది..
 

46
Stuart Broad

నాకున్న అతి పెద్ద భయం, 20 ఏళ్ల ఓపెనింగ్ బ్యాటర్లకు బౌలింగ్ చేయాల్సి రావడమే... నా గురించి వాళ్లు, ‘‘స్టువర్ట్ బ్రాడ్ చాలా గొప్ప బౌలర్ అని విన్నా, కానీ అవన్నీ ఉట్టి మాటలే..’’ అనడం వినకూడదని కోరుకున్నా. ఓ స్టార్ పర్ఫామర్‌గానే రిటైర్ అవ్వాలని అనుకున్నా..
 

56
Stuart Broad

ఇంకా కొన్ని నెలలు క్రికెట్ ఆడి, గాయపడితే మళ్లీ దాని గురించి కోలుకోవడానికి సమయం తీసుకుని.. సమయాన్ని వృథా చేయడం అనవసరమని అనిపించింది. నా కెరీర్‌లో యాషెస్ సిరీస్‌ ఓ మైలురాయి. అందుకే యాషెస్ సిరీస్‌లోనే రిటైర్మెంట్ తీసుకున్నా..

66
Image credit: Getty

నేను బౌలింగ్ చేసేటప్పుడు నా సైగల ద్వారా వికెట్ కీపర్‌కి సిగ్నల్ ఇచ్చేవాడిని. వాతావరణంతో సంబంధం లేకుండా నా షర్ట్‌ని పైకి మడత బెడితే స్లో బాల్స్ వేయబోతున్నానని సిగ్నల్. చాలామందికి నేను ఎందుకు ఇలా చేస్తున్నానో అర్థమయ్యేది కాదు..’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. 

click me!

Recommended Stories