అదంతా ఓవర్‌రేటెడ్! ఐపీఎల్‌‌లో ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు... కెఎల్ రాహుల్ కామెంట్...

Published : Mar 07, 2023, 05:21 PM ISTUpdated : Mar 07, 2023, 05:22 PM IST

కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌తో తెగ ఇబ్బందిపడుతూ టీ20ల్లో, టెస్టుల్లో చోటు కోల్పోయాడు కెఎల్ రాహుల్. రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో వన్డేల్లో మాత్రం రాహుల్‌కి ఇంకా ప్లేస్ దక్కుతోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు రాహుల్...  

PREV
16
అదంతా ఓవర్‌రేటెడ్! ఐపీఎల్‌‌లో ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు... కెఎల్ రాహుల్ కామెంట్...
Lucknow Super Giants

2020-21 సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్‌ని ఏకంగా రూ.17 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. రాహుల్ కెప్టెన్సీలో ప్లేఆఫ్స్ చేరిన లక్నో, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతుల్లో ఓడి, ఇంటిదారి పట్టింది...
 

26

ఐపీఎల్ 2020 సీజన్‌లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన కెఎల్ రాహుల్, గత రెండు సీజన్లలోనూ 600+ పరుగులు చేసి... ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. రాహుల్, టీమ్‌ని గెలిపించడం కంటే కూడా ఆరెంజ్ క్యాప్ గెలవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతుంటాయి... 

36
Lucknow Super Giants

కెఎల్ రాహుల్ కూడా టీ20ల్లో వన్డే స్టైల్ బ్యాటింగ్‌‌తో విసిగించే కెఎల్ రాహుల్, స్టైయిక్ రేటు కారణంగా టీ20ల్లో చోటు కూడా కోల్పోయాడు. అయితే ఈసారి కెఎల్ రాహుల్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది లక్నో సూపర్ జెయింట్స్ టీమ్. తాజాగా ఎల్‌ఎస్‌జీ కొత్త జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో కొన్ని కామెంట్లు చేశాడు కెఎల్ రాహుల్.. 

46
Image credit: PTI

‘టీ20ల్లో స్ట్రైయిక్ రేటు చాలా ఓవర్‌రేటెడ్ విషయం. దానికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. సందర్భాన్ని బట్టి స్ట్రైయిక్ రేటు డిసైడ్ అవుతుంది. 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు 200 స్ట్రైయిక్ రేటుతో ఆడాల్సిన పని లేదు... పరిస్థితిని బట్టి ఆడితే సరిపోతుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు కెఎల్ రాహుల్...

56

ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్, రాహుల్‌ని ప్రశంసల్లో ముంచెత్తాడు. ‘కెఎల్ రాహుల్‌ లాంటి ప్లేయర్ కెప్టెన్‌గా దొరకడం మా అదృష్టం. అతను చాలా స్థిరమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు దూకుడుగా ఉండేవాడిని. రాహుల్ చూశాక ఇంత ప్రశాంతంగా ఉండి ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్..

66

లక్నో సూపర్ జెయింట్స్ న్యూ జెర్సీపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. కాస్త గుజరాత్ జెయింట్స్ జెర్సీని, ఇంకాస్త ముంబై ఇండియన్స్ జెర్సీని కలిపి కొట్టినట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ కొత్త జెర్సీ ఉందని మీమ్స్ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.. 
 

click me!

Recommended Stories