ఆర్‌సీబీ క్యాంపులో హోలీ ఉత్సవాలు... రంగుల్లో విదేశీ భామలు! నో ఎమోషన్స్, ఓన్లీ సెలబ్రేషన్స్...

Published : Mar 07, 2023, 04:03 PM IST

సరిహద్దులను చెరిపేసి, దేశవిదేశీ ప్లేయర్లను ఓ జట్టుగా చేర్చే ఘనత లీగ్ క్రికెట్‌కే దక్కుతుంది. ఐపీఎల్‌ కారణంగానే ఏబీ డివిల్లియర్స్- విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ - కేన్ విలియంసన్, ధోనీ - బ్రావో, రోహిత్ శర్మ - కిరన్ పోలార్డ్ వంటి వాళ్లు మంచి స్నేహితులుగా మారారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఇదే సంస్కృతి కొనసాగుతోంది..

PREV
16
ఆర్‌సీబీ క్యాంపులో హోలీ ఉత్సవాలు... రంగుల్లో విదేశీ భామలు! నో ఎమోషన్స్, ఓన్లీ సెలబ్రేషన్స్...

తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా టీమ్, హోలీ సెలబ్రేషన్స్‌ని నిర్వహించింది. మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ, ఆ మూడ్ నుంచి టీమ్‌ని బయటికి తీసుకొచ్చేందుకు హోలీ పండగను వాడుకుంది...

26

ఈ హోలీ ఉత్సవాల్లో భారత క్రికెటర్లతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. హోలీ రంగుల్లో దిగిన ఫోటోలను ఎలీసా పెర్రీ, హేథర్ నైట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అభిమానులకు విషెస్ తెలియచేశారు...

36

అయితే ఈ ఫోటోలపై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత కూడా ఆర్‌సీబీ ప్లేయర్లు ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని? వారికి టీమ్‌ ఓడిందని ఎలాంటి బాధ లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.. 

46

మరికొందరు రెండు మ్యాచుల్లో ఓడినంత మాత్రాన ఏడుస్తూ కూర్చోవాలా? పండగలు కూడా సెలబ్రేట్ చేసుకోకూడదా? అని వారికి సపోర్ట్ చేస్తున్నారు.. 

56

మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓడిన ఉమెన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది... 

66

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మార్చి 8, బుధవారం గుజరాత్ జెయింట్స్ టీమ్‌తో తలబడనుంది ఉమెన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌...

click me!

Recommended Stories