ఈతరంలో తోపు బౌలర్లంటే ఆ నలుగురే... స్టీవ్ స్మిత్ కామెంట్, లిస్టులో ఓ భారత బౌలర్...

First Published Aug 8, 2021, 7:33 PM IST

ప్రస్తుత తరంలో ది బెస్ట్ బ్యాట్స్‌మెన్లలో స్టీవ్ స్మిత్ ఒకడు. వన్డే, టీ20ల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా టెస్టుల్లో టాప్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు స్టీవ్ స్మిత్. గాయం కారణంగా టీ20 వరల్డ్‌కప్‌ 2021కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న స్టీవ్ స్మిత్... ప్రస్తుత తరంలో ది బెస్ట్ టాప్ 4 బౌలర్ల గురించి చెప్పుకొచ్చాడు...

అత్యధిక వేగంగా 7 వేల టెస్టు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన స్టీవ్ స్మిత్, యాషెస్ సిరీస్‌కి ఫిట్‌గా ఉండేందుకు అవసరమైతే టీ20 వరల్డ్‌కప్‌కి కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు...

తాజాగా ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత తరంలో అదరగొడుతున్న నలుగురు బౌలర్ల గురించి చెప్పుకొచ్చాడు స్టీవ్ స్మిత్. అయితే స్మిత్ లిస్టుల్లో ఒక్క స్పిన్నర్ కూడా లేకపోవడం విశేషం...

జస్ప్రిత్ బుమ్రా: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, ప్రస్తుత తరంలో మోస్ట్ డొమినెంట్ పేసర్‌గా పేర్కొన్నాడు స్టీవ్ స్మిత్...

జేమ్స్ అండర్సన్: ప్రస్తుత తరంలో సుదీర్ఘకాలంగా క్రికెట్ కెరీర్ కొనసాగిస్తున్న బౌలర్లలో ముందుంటాడు జేమ్స్ అండర్సన్. 150+ టెస్టులు ఆడిన జేమ్స్ అండర్సన్, 620 వికెట్లు తీసి టాప్ 3 మోస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు...

కగిసో రబాడా: సౌతాఫ్రికా యంగ్ సెన్సేషనల్ కగిసో రబాడాను ప్రస్తుత తరంలో మోస్ట్ డొమినెంట్ బౌలర్లలో ఒకటిగా పేర్కొన్నాడు స్టీవ్ స్మిత్... 

ప్యాట్ కమ్మిన్స్: ఆస్ట్రేలియాకి అద్భుత విజయాలు అందిస్తూ, టెస్టుల్లో టాప్ బౌలర్‌గా ఉన్న ప్యాట్ కమ్మిన్స్‌కి స్టీవ్ స్మిత్ మోస్ట్ డొమినెంట్ బౌలర్ల లిస్టులో చోటు దక్కింది...

ఐపీఎల్ 2021 సీజన్‌ ఫస్ట్ ఫేజ్‌లో ఆరు మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, ప్రస్తుతం మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగా యూఏఈలో జరిగే ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో స్టీవ్ స్మిత్ పాల్గొనకపోవచ్చు...

స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి స్టార్ ప్లేయర్లు లేకుండా ఆస్ట్రేలియా ఆడిన గత 8 మ్యాచుల్లో ఏడింట్లో ఓడింది. బంగ్లాదేశ్ చేతుల్లోనూ మొదటి మూడు మ్యాచుల్లో ఓడింది ఆస్ట్రేలియా...

బంగ్లాదేశ్‌తో జరిగిన నాలుగో టీ20లోనూ 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి అపసోపాలు పడింది. ఏడు వికెట్లు కోల్పోయి 17 ఓవర్లు ముగిసిన తర్వాత విజయాన్ని అందుకుని ఊపిరి పీల్చుకుంది. 

click me!