ఇప్పటిదాకా 13 మ్యాచులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ... 200 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం విశేషం.
చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇక మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్... ఐపీఎల్‌లో తన లోయెస్ట్ పర్ఫామెన్స్ స్కోరును బీట్ చేయాలన్నా చివరి మ్యాచ్‌లో కనీసం 85 పరుగులు చేయాల్సి ఉంటుంది మహేంద్ర సింగ్ ధోనీ...
2016 సీజన్‌లో 14 మ్యాచులు ఆడి... అత్యల్పంగా 284 పరుగులు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే ధోనీకి ఐపీఎల్‌లో ఇదే అత్యల్ప స్కోరు.
ఈ సీజన్‌లో ఇప్పటిదాకా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు మహేంద్ర సింగ్ ధోనీ. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 47 పరుగులు మాత్రమే. ప్రతీ సీజన్‌లోనూ కనీసం ఓ హాఫ్ సెంచరీ కొడుతూ వస్తున్న ధోనీ... ఆఖరి మ్యాచ్‌లో హాఫ్ బాదకపోతే ఈ సారి ఆ ఫీట్ మిస్ అవుతాడు.
ఇప్పటిదాకా 13 సీజన్లు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, ఈ సీజన్‌లో అత్యల్ప స్టైయిక్ రేటు సాధించాడు. ఇంతకుముందు సీజన్లలో కనీసం 121 నుంచి 162 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసే ధోనీ, ఈ సీజన్‌లో కేవలం 116.27 స్ట్రైయిక్ రేటు మాత్రమే మెయింటైన్ చేశాడు.
ఇప్పటిదాకా జరిగిన 13 మ్యాచుల్లో 7 సిక్సర్లు మాత్రమే బాదాదు మహేంద్ర సింగ్ ధోనీ... తన ఐపీఎల్ కెరీర్‌లో ఇదే అత్యల్పం. ఇంతకుముందు 2010 సీజన్‌లో 8, 2009లో 9, 2012లో 9 సిక్సర్లు బాదాడు ధోనీ.
మిగిలిన ప్రతీ సీజన్‌లోనూ 15 నుంచి 30 సిక్సర్ల దాకా బాదాడు మహేంద్ర సింగ్ ధోనీ. గత రెండు సీజన్లలో మూడేసి హాఫ్ సెంచరీలు బాదిన ధోనీ, 2019లో 23, 2018లో 30 సిక్సర్లు బాదాడు. మహీ తన లోయెస్ట్ ఫోర్ల రికార్డు అందుకోవాలంటే కనీసం 2 బౌండరీలు కొట్టాలి.
ఇన్ని చెత్త ప్రదర్శనలు నమోదుచేసిన మహేంద్ర సింగ్ ధోనీ... మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభమయ్యేలోపు దొరికే ఖాలీ సమయాన్ని క్రికెట్ ఆడుతూ గడపాలని అంటున్నాడు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగర్కర.
గత ఏడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత ధోనీ క్రికెట్ ఆడకపోవడంతో ప్రస్తుత సీజన్‌లో ధోనీ పూర్ పర్ఫామెన్స్‌కి ప్రధాన కారణమని చెప్పిన సంగర్కర, వచ్చే సీజన్‌లో ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే స్వదేశీ, విదేశీ లీగ్‌ల్లో పాల్గొంటూ క్రికెట్ ఆడుతూ ఉండాలని చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోనీ, బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొనాలనే ఆలోచనతో ఉన్నాడు. అలాగే వీలైన ఇంగ్లీష్ కౌంటీ క్లబ్‌ల్లోనూ పాల్గొనాలని చూస్తున్నాడు.