పాక్‌కు షాకివ్వనున్న బంగ్లా, లంక.. ఆసియా కప్ ఆతిథ్య హక్కులు అనుమానమే..?

Published : May 08, 2023, 04:04 PM IST

Asia Cup 2023: రాకరాక వచ్చిన మెగా టోర్నీ నిర్వహణ అవకాశం కూడా పాకిస్తాన్ కు దక్కేట్టు లేదు. ఈ టోర్నీని  పాకిస్తాన్ లో నిర్వహించేందుకు  భారత్ తో పాటు ఇతర సభ్య దేశాలు కూడా ఒప్పుకోవడం లేదు. 

PREV
16
పాక్‌కు షాకివ్వనున్న బంగ్లా, లంక.. ఆసియా కప్ ఆతిథ్య హక్కులు అనుమానమే..?

ఆసియా కప్ - 2023 నిర్వహణ లొల్లి ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.  గతేడాది టీ20 ప్రపంచకప్  సమయంలో బీసీసీఐ సెక్రటరీ  జై షా వ్యాఖ్యల అనంతరం మొదలైన రగడ ఇప్పటికీ  సా...గుతూనే ఉంది.  ఈ టోర్నీని పాకిస్తాన్ లో నిర్వహిస్తే తాము రాబోమని   బీసీసీఐ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.  

26

హైబ్రిడ్ మోడల్ అయితేనే తాము ఆసియా కప్ ఆడతామని బీసీసీఐ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కి తేల్చిచెప్పినట్టు  గతంలో వార్తలు వెలువడ్డాయి. దీని ప్రకారం  ఈ టోర్నీలో భారత్ ఆడబోయే మ్యాచ్ లు  పాకిస్తాన్ ఆవల (ఇంకా వేదికను కన్ఫర్మ్ చేయలేదు) నిర్వహిస్తూ మిగతా  మ్యాచ్ లను  పాక్ లోనే నిర్వహించేందుకు  పీసీబీ కూడా అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి.

36

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్లాన్ కూడా బెడిసికొట్టింది.  పాకిస్తాన్ లో ఆసియా కప్ నిర్వహణకు తాము అనుకూలంగా లేమని.. భారత్ మాదిరిగానే తాము కూడా పాకిస్తాన్ లో ఆసియా కప్ జరిగితే ఆడబోమని  శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) , బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) లు  ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కు తెలిపినట్టు సమాచారం. 

46
Image credit: Getty

ఇది పాకిస్తాన్ కు భారీ ఎదురుదెబ్బే.  ఇన్నాళ్లు భారత్ రాకున్నా బంగ్లా, లంకల వస్తున్నాయని, ఆ రెండు దేశాలకు లేని  భద్రతా సమస్యలు  భారత్ కే ఎందుకు వస్తున్నాయని అక్కడి  మాజీ క్రికెటర్లు,  చోటా మోటా ఆటగాళ్లు  పరిపరి విధాలుగా కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు బంగ్లా, లంక కూడా షాకివ్వడంతో వారంతా ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం. 

56

ఇదిలాఉండగా  పాకిస్తాన్  లో ఈ టోర్నీ నిర్వహించకుంటే ఒకవేళ పాక్ కూడా ఈ  టోర్నీలో ఆడటానికి బహిష్కరిస్తే అప్పుడు   బాబర్ ఆజమ్ సేనకు బదులుగా యూఏఈ క్రికెట్ జట్టును  ఆడించాలని  ఏసీసీ భావిస్తున్నది. ఒకవేళ ఇదే జరిగి.. పాకిస్తాన్ రాకుంటే టోర్నీకి అయ్యే నష్టాన్ని  కూడా రాబోయే సిరీస్ లలో తాము భరిస్తామని బ్రాడ్కాస్టర్లకు బీసీసీఐ హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తున్నది.  
 

66

అదీగాక ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్ నుంచి తరలిపోతే దానిని నిర్వహించేందుకు తాము రెడీగా ఉన్నామంటూ శ్రీలంక, బంగ్లాదేశ్ లు సంసిద్ధదత  వ్యక్తం చేశాయి. వాస్తవానికి గతేడాది  ఆసియా కప్ శ్రీలంకలోనే జరగాల్సి ఉంది.  కానీ ఆగస్టులో లంకలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం, దేశంలో  పరిస్థితులేమీ బాగోలేకపోవడంతో  దానిని యూఏఈకి తరలించిన విషయం తెలిసిందే. ఇక ఆసియా కప్ - 2023 నిర్వహణ రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి. 

click me!

Recommended Stories