SRH vs RCB: ఇరు జట్లకూ అదే సమస్య... అధిగమించేదెలా...

First Published Sep 21, 2020, 4:49 PM IST

IPL 2020: ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కి మంచి ఘనమైన రికార్డే ఉంది. 2013లో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు, ఇప్పటిదాకా ఐదు సార్లు ప్లేఆఫ్ చేరింది, ఓసారి టైటిల్ గెలిచింది, మరోసారి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు ఐదు సార్లు ఫ్లేఆఫ్స్, మూడు సార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్లు ఉన్నా ఒకే ఒక్క సమస్య పట్టి పీడుస్తోంది. అదే మిడిల్ ఆర్డర్. 

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, కేన్ విలియంసన్ రూపంలో టాప్ ఆర్డర్ బలిష్టంగా ఉంది.
undefined
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో బ్యాటింగ్ భారమంతా విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌ల పర్ఫామెన్స్‌పైనే ఆధారపడి ఉంది.
undefined
హైదరాబాద్ జట్టులో మనీశ్ పాండే, విరాట్ సింగ్, విజయ్ సింగ్, మహ్మద్ నబీ వంటి ప్లేయర్లు మిడిల్ ఆర్డర్‌లో ఉన్నా వీళ్లు పెద్దగా రాణించడం లేదు.
undefined
ఐపీఎల్‌లో మొదటి సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన మనీశ్ పాండే, ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోవడం లేదు..
undefined
ఈ ఏడాది కొత్తగా జట్టులోకి వచ్చిన అండర్ 19 సెన్సేషన్ ప్రియమ్ గార్గే ఆకట్టుకుంటే, సన్‌రైజర్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ కష్టాలు తీరినట్టే.
undefined
బెంగళూరు జట్టును మిడిల్ ఆర్డర్ సమస్య ఎప్పటి నుంచో పట్టి పీడుస్తోంది. శివమ్ దూబే, మెయిన్ ఆలీ వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నా వాళ్లు గత సీజన్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు.
undefined
ఈ సీజన్‌లో జట్టులోకి వచ్చిన ఆరోన్ ఫించ్, యంగ్ బ్యాట్స్‌మెన్ దేవ్‌దత్ పడిక్కల్‌పైన బెంగళూరు బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.
undefined
బెంగళూరు జట్టులో చాహాల్, నవ్‌దీప్ శైనీ, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్ విభాగాన్ని మోయబోతున్నారు.
undefined
హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్,సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ బౌలింగ్ చేయబోతున్నారు.
undefined
గత సీజన్‌లో లో స్కోరింగ్ మ్యాచుల్లోనూ హైదరాబాద్ విజయం సాధించిందంటే దానికి కారణం హైదరాబాద్ బౌలర్ల ప్రదర్శనే.
undefined
click me!