SRHvsKXIP: గేల్ దిగుతున్నాడు... నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

Published : Oct 08, 2020, 04:11 PM IST

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇరుజట్లకీ కీలకమైన నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

PREV
114
SRHvsKXIP: గేల్ దిగుతున్నాడు... నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

ఇప్పటిదాకా సన్‌రైజర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య 14 మ్యాచులు జరిగాయి. 

214

హైదరాబాద్ 10 మ్యాచుల్లో విజయం సాధించగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4 మ్యాచుల్లో గెలుపొందింది.

314

ఐదింట్లో నాలుగు మ్యాచులు ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి ఇకపై ప్రతీ మ్యాచ్ విలువైనదే. దాంతో నేటి మ్యాచ్‌లో అన్ని అస్త్రాలతో బరిలో దిగుతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
 
414

క్రిస్‌గేల్: మొదటి 5 మ్యాచుల్లో క్రిస్‌గేల్‌ను పక్కనబెట్టి భారీ మూల్యం చెల్లించుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, నేటి మ్యాచ్‌లో యూనివర్సల్ బాస్‌ను బరిలో దించుతోంది. గేల్ క్రీజులో ఉంటే, ఎలాంటి బౌలర్ అయినా భయపడాల్సిందే.

514

డేవిడ్ వార్నర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లో 170 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్‌లో చెలరేగే వార్నర్ ఆటను ఇంకా చూడలేదు ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్...

614

బెయిర్‌స్టో: గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన బెయిర్ స్టో, ఈ సీజన్‌లో సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. వార్నర్ తోడుగా బెయిర్ స్టో ఓ భారీ ఇన్నింగ్స్ ఆడితే సన్‌రైజర్స్ కష్టాలు తీరినట్టే.

714

కేఎల్ రాహుల్: సీజన్‌లో బ్యాట్స్‌మెన్‌గా అదరగొడుతున్నాడు కెఎల్ రాహుల్. ఓ సెంచరీతో పాటు 2 హాఫ్ సెంచరీలతో 302 పరుగులు చేశాడు. అయితే జట్టును గెలిపించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్న రాహుల్, నేటి మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. 

814

మయాంక్ అగర్వాల్: ఈ సీజన్‌లో ఓ సెంచరీతో 272 పరుగులు చేశాడు మయాంక్. ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్‌తో పోటీపడుతున్న మయాంక్ అగర్వాల్, నేటి మ్యాచ్‌లో కీలకం కానున్నాడు.

914

కేన్ విలియంసన్ బ్యాటు నుంచి ఓ మెరుపు ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. గత మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌గా ఫెయిల్ అయ్యాడు కేన్ విలియంసన్. సన్‌రైజర్స్ ఓటమికి విలియంసన్ త్వరగా అవుట్ అవ్వడం కూడా ఓ కారణం.

1014

ముజీబ్ వుర్ రెహ్మన్: ఆఫ్ఘాన్ పేసర్ ముజీబ్ రెహ్మాన్, ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నేటి మ్యాచ్‌లో రెహ్మాన్ బరిలో దిగే అవకాశం ఉంది. 

1114

రవి బిష్ణోయ్: ఈ అండర్ 19 సెన్సేషన్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మొదటి మూడు మ్యాచుల్లో మ్యాజిక్ చేసిన బిష్ణోయ్, సన్‌రైజర్స్‌పై ఎలా ఆడతాడో చూడాలి. 

1214

రషీద్ ఖాన్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఉన్న గేమ్ ఛేంజర్ రషీద్ ఖాన్. బంతితో రషీద్ మ్యాజిక్ చేస్తే సన్‌రైజర్స్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు.

1314

మహ్మద్ షమీ: షమీ మొదటి మూడు మ్యాచుల్లో అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్‌పై షమీ విజృంభిస్తే... హైదరాబాద్‌కి కష్టాలు తప్పకపోవచ్చు.

1414

నటరాజన్: భువనేశ్వర్ కుమార్ గాయపడడంతో యంగ్ బౌలర్ టి. నటరాజన్‌పై భారీ అంచనాలున్నాయి. సిద్ధార్థ్ కౌల్ మొదటి మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇవ్వడంతో నటరాజన్‌పైనే ఆశలు పెట్టుకుంది ఎస్‌ఆర్‌హెచ్.

click me!

Recommended Stories