IPL 2020: జాదవ్‌ ఆట అద్భుతం... జట్టు నుంచి తీసేయాలంటూ పిటిషన్...

First Published Oct 8, 2020, 3:26 PM IST

IPL 2020 సీజన్ 13లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత పంజాబ్‌పై గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేజేతులా ఓడింది. 168 పరుగుల ఈజీ టార్గెట్‌ను చేధించలేక 10 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. దీనికి జాదవ్ జిడ్డు ఆట కూడా ఓ కారణం. దీంతో కేదార్ జాదవ్‌ను ట్రోల్ చేస్తూ మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

12 బంతుల్లో 11 పరుగులు చేసిన ధోనీ, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
undefined
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్... టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు.
undefined
ధోనీ అవుటైన తర్వాతి ఓవర్‌కే సామ్ కుర్రాన్ కూడా అవుట్ కావడంతో వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాడు...
undefined
రెండు ఓవర్లలో 35 పరుగులు కావాల్సిన దశలో హిట్టర్ జడేజాకి స్టైయిక్ ఇవ్వడానికి కూడా నిరాకరించాడు జాదవ్...
undefined
5 బంతుల్లో 7 పరుగులు చేసిన జడేజాకి, 9 బంతుల్లో 6 పరుగులు చేసిన జాదవ్ స్టైయికింగ్ ఇవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
undefined
ఆఖరి ఓవర్‌లో 25 పరుగులు కావాల్సిన దశలో మొదటి మూడు బంతులు ఆడిన జాదవ్, మూడో బంతికి సింగిల్ తీశాడు.
undefined
మూడు బంతుల్లో 24 పరుగులు కావాల్సిన టైమ్‌లో స్టైకింగ్ తీసుకున్న జాదవ్, ఓ సిక్స్, రెండు ఫోర్లతో 14 పరుగులు చేశాడు.
undefined
జాదవ్ హిట్టింగ్ చేసినా, జడేజాకి స్టైయికింగ్ ఇచ్చినా చెన్నైకి గెలుపు అవకాశాలు ఉండేవి...
undefined
భారీ షాట్లు ఆడాల్సిన టైమ్‌లో డాట్ బాల్స్ ఆడుతూ సింగిల్స్ తీసిన జడేజా, కేకేఆర్ విజయానికి కారణమయ్యాడని అతనికే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇవ్వాలని ట్రోల్ చేస్తున్నారు సీఎస్‌కే ఫ్యాన్స్..
undefined
కేదార్ జాదవ్‌ను 8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్..
undefined
చెన్నై సూపర్ కింగ్స్ తరుపున మూడు సీజన్లలో ఇప్పటిదాకా జాదవ్ చేసింది 237 పరుగులు... అంటే ప్రతీ పరుగుకి రూ.10 లక్షలు తీసుకుంటున్నాడు కేదార్ జాదవ్.
undefined
చెన్నై గెలిచిన రెండు మ్యాచుల్లో జాదవ్ బ్యాటింగ్‌కి రాలేదు. జాదవ్ బ్యాటింగ్ చేసిన నాలుగు మ్యాచుల్లో చెన్నై చిత్తుగా ఓడింది.
undefined
కేవలం మహేంద్ర సింగ్ ధోనీకి సన్నిహితుడైన కారణంగానే కేదార్ జాదవ్ పరుగులు చేయకపోయినా జట్టులో కొనసాగుతున్నాడని కామెంట్ చేస్తున్నారు సీఎస్‌కే ఫ్యాన్స్..
undefined
కేదార్ జాదవ్‌ను వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తొలగించాలని ఆన్‌లైన్ పిటిషన్ వేసి సంతకాలు సేకరిస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు.
undefined
సాధారణంగా చెన్నై ఓడిపోతే ధోనీపై ట్రోల్స్ వస్తాయి. అయితే జాదవ్ టెస్ట్ ఇన్నింగ్స్ కారణంగా ధోనీ ఈసారి ట్రోలింగ్ నుంచి తప్పించుకున్నాడు.
undefined
click me!