SRHvsDC: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... భువనేశ్వర్ కుమార్ లేకుండానే...

First Published Apr 25, 2021, 7:10 PM IST

IPL 2021 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలబడుతోంది. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

చెన్నై చెపాక్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే మెజారిటీ మ్యాచుల్లో విజయం దక్కడం విశేషం. అయితే గత రెండు మ్యాచుల్లో ఇక్కడ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది.
undefined
వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్‌కి గత మ్యాచ్‌లో ఊరట విజయం దక్కగా, ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మ్యాచుల్లో మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
undefined
సీజన్ ఆరంభంలో కరోనా బారిన పడిన స్పిన్నర్ అక్షర్ పటేల్, నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు. ఢిల్లీ జట్టులో అక్షర్ పటేల్, అశ్విన్, మిశ్రా రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉండడం విశేషం.
undefined
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయంతో బాధపడడంతో అతని స్థానంలో జగదీశ సుచిత్, ఐపీఎల్ ఆరంగ్రేటం చేస్తున్నాడు.
undefined
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:పృథ్వీషా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, హెట్మయర్, స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, కేన్ విలియంసన్, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, జగదీశ సుచిత్, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్
undefined
click me!