మాల్దీవుల్లో ఫుల్లుగా తాగి కొట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు... డేవిడ్ వార్నర్‌తో పాటు...

First Published May 9, 2021, 10:17 AM IST

ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడడం, కరోనా సెకండ్ వేవ్ కేసుల కారణంగా భారత్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై నిషేధం ఉండడంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు మాల్దీవుల్లో సేద తీరుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ ఫుల్లుగా తాగి ఇద్దరు క్రికెటర్లు కొట్టుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్ 2021 కోసం భారత్‌కి వచ్చిన 14 మంది క్రికెటర్లతో పాటు కోచ్‌లు, కామెంటేటర్లు, ఇతర సిబ్బంది ప్రస్తుతం మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు...
undefined
అయితే శనివారం మాల్దీవుల్లోని ఓ బార్‌లో ఫుల్లుగా తాగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆసీస్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లాటర్... కొట్టుకున్నారని సమాచారం...
undefined
ప్రస్తుతం ఆసీస్ క్రికెటర్లు బస చేస్తున్న తాజ్ కోరల్ రిసార్ట్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఆసీస్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లాటర్ ఈ వార్తను తీవ్రంగా ఖండించాడు...
undefined
‘డేవిడ్ వార్నర్ నేను చాలా మంచి స్నేహితులం. మా మధ్య ఏ విషయం మీదా, ఎలాంటి పరిస్థితుల్లోనూ గొడవ జరిగే అవకాశమే లేదు. ఇదంతా కేవలం పుకారే’ అంటూ కామెంట్ చేశాడు మైకేల్ స్లాటర్...
undefined
డేవిడ్ వార్నర్ కూడా గొడవ జరిగినదానికి ఆధారాలేమీ లేకుండా వార్తలెలా రాస్తారంటూ ఆసీస్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు...
undefined
ఐపీఎల్ కోసం ఇండియాకి, ఆ తర్వాత ఇక్కడి కరోనా కేసులతో బయపడి ముందుగానే స్వదేశం చేరడానికి బయలుదేరాడు ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న మైకేల్ స్లాటర్...
undefined
అయితే ఎంత ప్రయత్నించినా, ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీలు కాకపోవడంతో ఆ దేశ ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు చేశాడు. ‘ప్రధానిగా మా రక్షణ బాధ్యత మీది కాదా? మీ చేతులకు రక్తం అంటుకుంటోంది’ అంటూ ట్వీట్లు చేశాడు.
undefined
మరోవైపు ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరింట్లో ఐదు మ్యాచులు ఓడిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
undefined
కేన్ విలియంసన్ కెప్టెన్సీలో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ తుదిజట్టులో కూడా స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత ఐపీఎల్ వాయిదా పడడం విశేషం.
undefined
click me!