గెలవాలంటే ఈ టీమ్ ఉండాలి... టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి జట్టును కామెంటేటర్ హర్షా భోగ్లే ...

First Published May 8, 2021, 3:45 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌కి మధ్యలోనే బ్రేక్ పడడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కి భారత జట్టుకి కావాల్సినంత సమయం దొరికింది. ఇప్పటికే 20 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇందులోనుంచి బెస్ట్ ఎలెవన్ ఆడించాలని చెబుతూ జట్టును ట్వీట్ చేశాడు క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే...

ఆసీస్ టూర్‌లో ఓపెనర్‌గా రాణించిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ అతని పర్ఫామెన్స్ బాగోలేదు.
undefined
కాబట్టి ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత జరిగే ప్రాక్టీస్ మ్యాచుల్లో మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్‌ ఇద్దరిలో ఎవరి ఫామ్‌ బాగుంటే... వారికి తుదిజట్టులో అవకాశం కల్పించాలని కోరాడు హర్షా భోగ్లే...
undefined
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ... ఇద్దరిలో ఒకరికి తుదిజట్టులో స్థానం కల్పించాలని కోరాడు. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ఇషాంత్‌కి, ఫామ్‌ బట్టి చూసుకుంటే సిరాజ్‌కి చోటు దక్కినా పర్వాలేదని చెప్పాడు.
undefined
రోహిత్ శర్మతో పాటు శుబ్‌మన్ గిల్ లేదా మయాంక్ అగర్వాల్ ఓపెన్ చేయగా... వన్‌డౌన్‌లో ఛతేశ్వర్ పూజారా బ్యాటింగ్‌కి వస్తాడు...
undefined
టూ డౌన్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ, ఆ తర్వాత వైస్ కెప్టెన్ అజింకా రహానే బ్యాటింగ్‌కి వస్తారు. అయితే టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ హనుమ విహారికి మాత్రం హర్షా భోగ్లే టీమ్‌లో చోటు దక్కలేదు.
undefined
హనుమ విహారితో పాటు కెఎల్ రాహుల్‌ను పక్కనబెట్టిన హర్షా భోగ్లే... వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను, ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు జట్టులో చోటు ఇచ్చాడు.
undefined
అలాగే బుమ్రా, షమీలకి తుదిజట్టులో చోటు తప్పనిసరిగా ఉండాలని చెప్పిన హర్షా భోగ్లే... వారితో పాటు మహ్మద్ సిరాజ్ లేదా ఇషాంత్ శర్మల్లో ఒకరికి చోటు ఇవ్వాలని సూచించాడు.
undefined
హర్షా భోగ్లే ప్రకటించిన తుదిజట్టు ఇది: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్మయాంక్ అగర్వాల్, పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, సిరాజ్ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, బుమ్రా
undefined
click me!