మే 25 నుంచి బయో బబుల్‌లోకి భారత క్రికెటర్లు... అక్కడికెళ్లాక మరో 10 రోజులు... బీసీసీఐ ప్లాన్...

First Published May 8, 2021, 4:10 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో బయో బబుల్ బ్రేక్ అవ్వడం భారత జట్టుకి కొత్త కష్టాలను తెచ్చిపెట్టినట్టైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బయో సెక్యూలర్ జోన్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో భారత క్రికెటర్లపై కఠిన ఆంక్షలు విధించనుంది ఇంగ్లాండ్...

భారత్ నుంచే వచ్చేవాళ్లు ఎవ్వరైనా ఇంగ్లాండ్‌లో 14 రోజుల పాటు కఠినమైన క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. వేరేవాళ్లను కలవడానికి కానీ, హోటల్ గది నుంచి బయటికి రావడానికి కానీ ఎలాంటి ఆస్కారం ఉండదు...
undefined
అయితే భారత క్రికెటర్లు మరీ ఇంత కఠినమైన క్వారంటైన్‌లో ఉండేందుకు ఇబ్బంది పడుతున్నారని భావించిన బీసీసీఐ... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు కొన్ని సూచనలు చేసింది.
undefined
అవి ఏంటంటే ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లడానికి వారం రోజుల ముందే భారత క్రికెటర్లు... బయో బబుల్ జోన్‌లోకి వస్తారు. అంటే మే 25 నుంచి ఆటగాళ్లు సెక్యూలర్ జోన్‌లో ఉంటారు.
undefined
ఇందులోకి రావడానికి ముందే ప్లేయర్లందరికీ మూడు సార్లు కరోనా పరీక్షలు జరుగుతాయి. బయో బబుల్‌లో వారం రోజుల పాటు గడిపిన తర్వాత జూన్ 2న ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్తుంది టీమిండియా...
undefined
ముందుగానే బయో బబుల్‌లో గడపడం వల్ల అక్కడ 14 రోజులు కాకుండా కేవలం 10 రోజులు క్వారంటైన్‌లో ఉంటారు భారత ఆటగాళ్లు.
undefined
అదీకాకుండా వీరికి ఈ క్వారంటైన్‌లో తోటి ఆటగాళ్లను కలిసేందుకు, ప్రాక్టీస్ చేసేందుకు వీలు ఉంటుంది... ఈ సదుపాయం వల్ల క్వారంటైన్ పీరియడ్‌ను పూర్తి చేసినట్టు ఉంటుంది, ప్రాక్టీస్ కూడా జరుగుతుంది...
undefined
undefined
click me!