IPL 2022: ఫాస్టెస్ట్ డెలివరీలు సరే.. వికెట్లేవి ఉమ్రాన్..? లక్ష రూపాయల చెక్కు కోసమే బౌలింగ్ చేస్తున్నావా..?

Published : Apr 12, 2022, 01:36 PM IST

Umran Malik: గతేడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్ గాయపడటంతో  నెట్ బౌలర్ గా ఉన్న కాశ్మీరి కుర్రాడు ఉమ్రాన్ మాలిక్.. ఈసారి  హైదరాబాద్ కు  ప్రధాన బౌలర్ అయినప్పటికీ  బౌలింగ్ లో మాత్రం వైవిద్యం చూపడం లేదు. 

PREV
18
IPL 2022: ఫాస్టెస్ట్ డెలివరీలు సరే.. వికెట్లేవి ఉమ్రాన్..? లక్ష రూపాయల చెక్కు కోసమే బౌలింగ్ చేస్తున్నావా..?

‘ఉమ్రాన్ మాలిక్ త్వరలోనే ఇండియాకు ఆడతాడనే నమ్మకం నాకుంది.  నేను బీసీసీఐ లో ఉంటే గనక ఆ కుర్రాడిని ఏదైనా కౌంటీ క్రికెట్ క్లబ్ కు పంపి మెరుగుపరిచేవాడిని.  అద్భుతమైన బౌలర్..’ అని ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ మైఖేల్ వాన్ అంతటి ఆటగాడు మెచ్చుకున్న బౌలర్ అతడు. 

28
Umran Malik

ఒక్క మైఖేల్ వాన్ మాత్రమే కాదు.. పలువురు మాజీ క్రికెటర్లు,  ప్రఖ్యాత క్రికెట్ కామెంటేటర్  హర్షాభోగ్లే కూడా  ఈ కుర్రాడి  బౌలింగ్ వేగానికి ఇంప్రెస్ అయ్యాడు.  

38

అయితే వేగాన్ని మాత్రమే నమ్ముకున్న ఉమ్రాన్ మాలిక్.. తన బౌలింగ్ లో వైవిద్యం చూపలేకపోతున్నాడు. ఈ ఐపీఎల్ లో ఇప్పటికీ నాలుగు మ్యాచులు ఆడిన  ఉమ్రాన్.. తాను ఆడిన ప్రతి  మ్యాచ్ లో కూడా అత్యధిక వేగంగా బంతి విసిరిన ఆటగాడిగా రికార్డులు సృష్టిస్తున్నాడు. 

48

తాను ఆడిన నాలుగు మ్యాచుల్లో కూడా ఉమ్రాన్ అత్యధిక వేగంతో బంతులు విసిరాడు. గుజరాత్ తో మ్యాచ్ లో 153.3 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరిన ఉమ్రాన్.. గత మూడు మ్యాచులలో కూడా 150 కి తగ్గకుండా ఫాస్టెస్ట్ డెలివరీలు సంధించాడు. 

58

అయితే మాలిక్ వేగంగా బంతులు విసురుతున్నాడే తప్ప వికెట్లైతే తీయడం లేదు. పోని పొదుపుగా బౌలింగ్ చేశాడా..? అంటే అదీ  లేదు.  రాజస్థాన్ రాయల్స్ తో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 39 పరుగులిచ్చుకున్నాడు. లక్నోతో మ్యాచ్ లో 3 ఓవర్లలో 39.. చెన్నై సూపర్ కింగ్స్ తో 3 ఓవర్లలో 29.. ఇక గుజరాత్ తో సోమవారం ముగిసిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 39 పరుగులిచ్చాడు. నాలుగు మ్యాచులలో కలిపి 3 వికెట్లు మాత్రమే తీశాడు. 

68

అయితే సోషల్ మీడియాలో  ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ పై పొగిడేవారితో పాటు జోకులు కూడా బాగానే పేలుతున్నాయి. ఉమ్రాన్ కేవలం ఫాస్టెస్ట్ డెలివరీ కోసం ఇచ్చే లక్ష రూపాయల చెక్కు కోసమే మ్యాచులు ఆడుతున్నాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 

78

ఇక మరికొందరేమో.. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో పెద్దగా షాట్లు ఆడాల్సిన అవసరం లేదని,  తమ నుంచి వెళ్తున్న బంతికి కొంచెం బ్యాట్ తగిలించినా ఆ వేగానికి బాల్ బౌండరీ దాటుతుందని మీమ్స్  చేస్తున్నారు.  

88

ఏదేమైనా వేగంగా బంతులు విసిరే బౌలర్లు కొరత ఉన్న భారత జట్టులో ఉమ్రాన్ వస్తే మంచిదే గానీ ఇలా పరుగులివ్వడం మాత్రం ఎంతమాత్రమూ హర్షించదగ్గది కాదు.  వేగంతో పాటు ఖచ్చితత్వం.. లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసిరితేనే వికెట్లు కూడా  దక్కుతాయనే విషయాన్ని ఉమ్రాన్ గుర్తెరిగితే మంచిదని అభిమానులు సూచిస్తున్నారు. 

click me!

Recommended Stories