వార్నర్ భాయ్, ఇదేం టీమ్ సెలక్షన్... ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కి ఇంత వీక్‌ టీమ్‌ ఆ...

First Published Apr 17, 2021, 8:10 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో తొలి విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు. మొదటి రెండు మ్యాచుల్లో విజయం అంచుల దాకా వచ్చి, పరాజయాన్ని చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, మూడో మ్యాచ్‌లో ఏకంగా నాలుగు మార్పులతో బరిలో దిగింది. అయితే ఈ మార్పులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు...

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహాను పక్కనబెట్టిన సన్‌రైజర్స్, షాబజ్ నదీం, నటరాజన్‌లను పక్కనబెట్టాడు. గత మ్యాచ్‌లో రాణించిన జాసన్ హోల్డర్ స్థానంలో ముజీబ్ వుర్ రెహ్మాన్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు.
undefined
రెండు ఓటముల తర్వాత జట్టులో మార్పులు చేయాలని అనుకోవడం సరైన నిర్ణయమే కానీ, చేసిన రిప్లేస్‌మెంట్‌లే సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు...
undefined
ముఖ్యంగా గత సీజన్‌లో అత్యధిక యార్కర్లు వేసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసి, టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నటరాజన్‌కి రెస్టు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...
undefined
మంచి ఫామ్‌లో ఉన్న నటరాజన్‌ను ఎందుకు పక్కనబెట్టారు? అతను గాయపడ్డాడా? లేక గత రెండు మ్యాచుల్లో పర్ఫామెన్స్ బాగోలేదని కూర్చోబెట్టారా? అనే దానిపై క్లారిటీ రాలేదు...
undefined
ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా డేవిడ్ వార్నర్‌కి లోకల్ ప్లేయర్ల గురించి తెలిసే అవకాశం లేదు. జట్టులో నాలుగు మార్పులు చేశానని చెప్పిన వార్నర్ భాయ్, వారి పేర్లను కూడా గుర్తు పెట్టుకోలేకపోయాడు...
undefined
వరుసగా విఫలమవుతున్నప్పటికీ విజయ్ శంకర్‌ను కొనసాగించిన సన్‌రైజర్స్, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ జట్లపై మంచి రికార్డు ఉన్న సందీప్ శర్మను వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆడించలేదు...
undefined
అలాగే బౌలర్లు రాణిస్తున్నా, బ్యాటింగ్‌లో విఫలమవుతుండడంతో జాసన్ రాయ్‌కి తుది జట్టులో చోటు కల్పించే ఉంటే బాగుండేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
undefined
వరుసగా రెండు మ్యాచుల్లో టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. కాబట్టి టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ చేయాలనే ఆలోచనతో వచ్చిన డేవిడ్ భాయ్, రోహిత్ నిర్ణయంతో షాక్‌కి గురై ఉంటాడు...
undefined
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. గత రెండు మ్యాచుల్లో తొలి వికెట్‌కి పెద్దగా భాగస్వామయం నమోదుచేయలేకపోయిన ముంబై, సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
undefined
click me!