అప్పటికంటే మంచి ఫామ్‌‌లో ఉన్నా... త్వరలో రీఎంట్రీ ఇస్తా... శ్రీశాంత్‌కి సురేష్ రైనా సపోర్ట్...

Published : Dec 01, 2020, 12:39 PM IST

2007 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో లాస్ట్ ఓవర్ వేసిన జోగిందర్ శర్మను, మిస్బా వుల్ హక్ క్యాచ్‌ను అందుకున్న పేసర్ శ్రీశాంత్‌ను క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ మరిచిపోరు. ఆ టోర్నీ తర్వాత జోగిందర్ శర్మ పెద్దగా క్రికెట్‌లో కనిపించలేదు. అనేక వివాదాల్లో ఇరుక్కున్న శ్రీశాంత్... స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా జీవితకాల నిషేధానికి గురయ్యాడు. రీఎంట్రీ ఇవ్వడానికి ఆశపడుతున్న శ్రీశాంత్‌కి అభినందనలు వస్తున్నాయి.

PREV
112
అప్పటికంటే మంచి ఫామ్‌‌లో ఉన్నా... త్వరలో రీఎంట్రీ ఇస్తా... శ్రీశాంత్‌కి సురేష్ రైనా సపోర్ట్...

2008 ఐపీఎల‌్‌లో హర్భజన్ సింగ్, శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టడం, శ్రీశాంత్ బోరున ఏడవడం పెద్ద సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే...

212

వికెట్ తీయగానే అరుస్తూ సంబరాలు చేసుకునే శ్రీశాంత్... ఓసారి సౌతాఫ్రికా టూర్‌లో ఆండ్రూ నెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది బౌలర్ ముందుకెళ్లి స్టెప్పులు వేశాడు..

312

ఐపీఎల్‌ 2013లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్టు అంగీకరించిన శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించింది బీసీసీఐ...

412

అయితే ఆ తర్వాత నిషేధాన్ని ఏడేళ్లకు కుదించింది. అయితే తానే తప్పు చేయలేదని, బలవంతంగా స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్టు ఒప్పించారని చెప్పుకొచ్చాడు శ్రీశాంత్.

512

నిషేధం పడిన సమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంతత్... ‘అక్సర్ 2’, ‘టీమ్ 5’, ‘కబరెట్’, ‘కెంపె గౌడ 2’ వంటి నాలుగు సినిమాల్లో నటించాడు...

612

కన్నడలో నటించిన ‘కెంప గౌడ 2’ సినిమాకు కూడా సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ విలన్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు శ్రీశాంత్..

712

‘ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా’ వంటి టీవీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న శ్రీశాంత్... ‘బిగ్ బాస్ 12’లో పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు....

812

2016లో రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్, బీజేపీ తరుపున తిరువనంతపురం ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు...

912

ఏడేళ్ల నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలతో పూర్తి కావడంతో మళ్లీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు శ్రీశాంత్. కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కప్ టీ20 ద్వారా శ్రీశాంత్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

1012

చాలా కాలం తర్వాత క్రికెట్‌లో రీఎంట్రీ ఇస్తున్న శ్రీశాంత్... ‘2007 ప్రపంచకప్ సమయంలో కంటే ఎప్పుడు ఎక్కువ ఫిట్‌గా ఉన్నాను. నాకు ఎంతో నచ్చిన క్రికెట్‌లో రాణించేందుకు నా చేతికి పనిపెడుతున్నాను. నన్ను ఇష్టపడేవారందరూ ఓ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు మీరే బెస్ట్ వెర్షన్ కానీ మరింత బెటర్, బెటర్ వెర్షన్ ఇచ్చేందుకు రెఢీగా ఉండండి....’ అంటూ ట్వీట్ చేశాడు.

1112

దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ సురేష్ రైనా... ‘గుడ్ లక్ మై బ్రదర్... బాగా ఆడు... నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా... రెస్పెక్ట్’ అంటూ ట్వీట్ చేశాడు...  ‘గుడ్ లక్, రన్నింగ్‌లో నీ మణికట్టును పంచ్ చేస్తూ ఉండు’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్... 

1212

వీరికి రిప్లై ఇచ్చిన శ్రీశాంత్... ‘థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్... నీ ప్రోత్సాహం, మద్ధతు నాకు ఎంతో విలువైనవి. నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పుడూ నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను’ అంటూ రైనా గురించి చెప్పుకొచ్చాడు.

click me!

Recommended Stories