INDvsAUS: రేపే ఆస్ట్రేలియాతో మూడో వన్డే... పరువు నిలవాలంటే ఈ మార్పులు చేయాల్సిందే...

First Published Dec 1, 2020, 10:29 AM IST

INDvsAUS: ఆస్ట్రేలియా టూర్‌లో ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ సేనకి ఏదీ కలిసి రావడం లేదు. ఆడిన రెండు వన్డేల్లోనూ పోరాడి ఓడిన టీమిండియా, 2-0 తేడాతో సిరీస్ కోల్పోయింది. మిగిలిన చివరి వన్డే గెలవకపోతే వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆఖరి వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది టీమిండియా. అయితే చివరి వన్డేలో గెలవాలంటే టీమిండియా కొన్ని మార్పులు చేయాల్సిందే...

సైనీ అవుట్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు నవ్‌దీప్ సైనీ. రెండు మ్యాచుల్లో కలిపి వేసింది 17 ఓవర్లే అయినా 150కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. తీసింది మాత్రం ఒకే ఒక్క వికెట్. వెన్నునొప్పితో బాధపడుతున్నాడని వార్తలు వినిపించిన నవ్‌దీప్ సైనీకి ఆఖరి వన్డే మ్యాచ్‌లో విశ్రాంతి కల్పిస్తే బెటర్.
undefined
నటరాజన్‌కి చోటు: ఐపీఎల్‌లో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్, భారత జట్టుతో ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అతన్ని టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసింది బీసీసీఐ. నవ్‌దీప్ సైనీ, బుమ్రా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అతని స్థానంలో యార్కర్ కింగ్‌గా పేరొందిన నటరాజన్‌కి జట్టులో చోటు కల్పిస్తే మంచి రిజల్ట్ రాబట్టేందుకు అవకాశం ఉంటుంది..
undefined
యజ్వేంద్ర చాహాల్- కుల్దీప్ జోడి: నవ్‌దీప్ సైనీతో పాటు యజ్వేంద్ర చాహాల్‌ని కూడా వీర బాదుడు బాదేశాడు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్. రెండు వన్డేల్లో కలిపి 19 ఓవర్లు బౌలింగ్ చేసిన చాహాల్... ఏకంగా 160కి పైగా సమర్పించుకుని ఒకే ఒక్క వికెట్ తీశాడు. రవీంద్ర జడేజా పెద్దగా పరుగులు ఇవ్వకపోయినా వికెట్లు పడగొట్టలేకపోయాడు. కాబట్టి అతని స్థానంలో ఆస్ట్రేలియాలో మంచి రికార్డు ఉన్న కుల్దీప్ యాదవ్‌కి అవకాశం ఇస్తే చాహాల్-కుల్దీప్ జోడితో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది.
undefined
ఓపెనర్‌గా కెఎల్ రాహుల్: ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు కెఎల్ రాహుల్. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ కలిసి సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. మయాంక్, శిఖర్ ధావన్ కలిసి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు నమోదుచేసినా, ఆ తర్వాత నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్లు పడేసుకున్నారు. కాబట్టి కెఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపితే మంచి రిజల్ట్ రావచ్చు.
undefined
బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు: రెండు మ్యాచుల్లోనూ 300+ పైగా స్కోరు చేసింది టీమిండియా. మొదట బ్యాటింగ్ చేస్తే మార్పులు అవసరం లేదు కానీ మరోసారి ఛేజింగ్ చేయాల్సి వస్తే మాత్రం బ్యాటింగ్ ఆర్డర్‌లో స్వల్ప మార్పులు చేస్తే బెటర్. ఐదో స్థానంలో వచ్చే కెఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా, మంచి హిట్టింగ్ చేయగల మయాంక్ అగర్వాల్‌ను అతని స్థానంలో ఆడించాలి...
undefined
టాస్ ముఖ్యం: మొదటి రెండు మ్యాచుల్లో టాస్ ఓడి, భారీ మూల్యం చెల్లించుకుంది టీమిండియా. మూడో మ్యాచ్‌లో పరువు నిలుపుకోవాలంటే టాస్ మరోసారి కీలక పాత్ర పోషించనుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాలంటే టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది.
undefined
భాగస్వామ్యాన్ని విడగొట్టాల్సిందే: రెండు మ్యాచుల్లోనూ మొదటి వికెట్‌కి దాదాపు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఆసీస్ ఓపెనర్లు. ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయడానికి ఇది ఓ కారణం. అయితే డేవిడ్ వార్నర్ గాయపడడంతో మూడో వన్డేలో ఆడడం లేదు. కాబట్టి మొదటి వికెట్‌ని వీలైనంత త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుంది భారత బౌలర్లు. తొలి వికెట్ త్వరగా కోల్పోతే ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవచ్చు.
undefined
స్మిత్‌పైన స్పిన్ అస్త్రం: రెండు మ్యాచుల్లోనూ 62 బంతుల్లోనే సెంచరీ బాదాడు స్టీవ్ స్మిత్. భీకరమైన ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత బెటర్. భారత స్పినర్లపై పెద్దగా రికార్డులేని స్మిత్‌పైన అదే అస్త్రాన్ని ప్రయోగిస్తే మంచి ఫలితం రాబట్టొచ్చు.
undefined
మ్యాక్స్‌వెల్‌కి అడ్డుకట్ట: స్టీవ్ స్మిత్‌తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా టీమిండియాకి పెద్ద కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. రెండు మ్యాచుల్లోనే దాదాపు 180+ స్టైయిక్ రేటుతో బౌండరీల మోత మోగించాడు మ్యాక్స్‌వెల్. అతన్ని నియంత్రించడంలో ఐపీఎల్‌లో స్పిన్నర్లు బాగా సక్సెస్ అయ్యారు. కాబట్టి మూడో వన్డేలో అతనిపై అదే ఫార్ములాను ప్రయోగించి చూడాలి.
undefined
కసి కావాలి: మొదటి రెండు వన్డేల్లో భారత జట్టులో కసి లోపించింది. బౌలర్లు అలసిపోయిన్టటు కనిపిస్తే, బ్యాట్స్‌మెన్ భారీ లక్ష్యాన్ని చేధించడం మనవల్ల కాదన్నట్టుగా నిరాశా దృక్ఫథంలో కనిపించారు. అందుకే టీమిండియా ఆటతీరుపై అనేక విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును, వారి దేశంలో ఆడించాలంటే భారత జట్టులో ప్రతి ప్లేయర్‌ కసితో ఆడాలి. ఆస్ట్రేలియాలో ఉన్నది, భారత జట్టులో మిస్ అయ్యింది ఇదే.
undefined
click me!