రోహిత్, కెఎల్ రాహుల్ ఇంకా ఆ మ్యాచ్‌ని మరిచిపోలేదు, వారి ముఖాల్లో భయం చూశా... - షోయబ్ అక్తర్...

First Published Oct 26, 2022, 10:59 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని భారత జట్టు ఘన విజయంతో ఆరంభించగా పాకిస్తాన్ కూడా తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతి దాకా పోరాడి ఓడింది. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరినా పాక్ 159 పరుగుల స్కోరు చేయగలిగింది..

Image credit: PTI

160 పరుగుల లక్ష్యఛేదనలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా... విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్, హార్ధిక్ పాండ్యా భాగస్వామ్యం కారణంగా 4 వికెట్ల తేడాతో విజయం అందుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ అవుటైన విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...

Rohit-Rahul

‘భారత ఓపెనర్లు ఇంకా గత ఏడాది మ్యాచ్‌ని మరిచిపోనట్టు ఉంది. వాళ్ల ముఖాల్లో భయం చూశా. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యుండి, తనకు తాను కూల్‌ చేసుకోలేకపోయాడు. చాలా ప్రెషర్‌లో కనిపించాడు. అతని బ్యాటింగ్ కంటే కూడా కెఎల్ రాహుల్‌ బ్యాటింగ్ వైపే ఎక్కువ ఫోకస్ పెట్టాడు...

Rohit Sharma and KL Rahul

కెఎల్ రాహుల్ మళ్లీ ఎప్పటిలాగే అత్యుత్సాహం చూపించి వికెట్ పారేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే అలాంటి షాట్ ఆడాల్సిన అవసరం ఏముంది? అవుట్ అవుతామోననే భయంతో బ్యాటింగ్‌కి వచ్చారు, అదే భయంతో పెవిలియన్‌ చేరారు...

సూర్యకుమార్ యాదవ్ కాస్త ఓవర్ కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఓపెనర్లు ఇద్దరూ అవుటైన తర్వాత షాట్స్ ఆడి, ప్రెషర్‌ని బౌలర్లపైకి ట్రాన్స్‌ఫర్ చేద్దామని చూశాడు. కానీ ప్లాన్ వర్కవుట్ కాలేదు... అందుకే అవుట్ అయ్యాడు..
 

Image credit: PTI

టీమిండియా బ్యాటింగ్ యూనిట్‌కి కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ చాలా ముఖ్యం. ప్రతీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఆడాలంటే ఆడరు. ఆడలేరు కూడా... ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్..

Rohit Sharma and KL Rahul

షాహీన్ షా ఆఫ్రిదీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తాడని అనుకున్నా, కానీ కెఎల్ రాహుల్‌కి ఇచ్చాడు. గత ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌లో ఆఫ్రిదీ బౌలింగ్‌లో మొదటి బంతికే అవుట్ కావడంతో రోహిత్ ఇలా చేసి ఉంటాడని కొందరు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు...

click me!