టీ20 ఫ్రాంఛైజీ లీగుల్లో ఏదీ ఐపీఎల్‌కి పోటీ రాదు. అయితే పాక్ క్రికెటర్లు మాత్రం పాక్ సూపర్ లీగ్ ముందు ఐపీఎల్ వేస్ట్ అని బడాయిలు పోతుంటారు. ఐపీఎల్‌లో అమ్ముడుపోని ప్లేయర్లు, పాక్ సూపర్ లీగ్‌లో ఆడుతూ అదే తోపు అని కామెంట్లు కూడా చేస్తారు. అయితే బీసీసీఐ ముందు పీసీబీ పిల్ల బచ్చా అని మరోసారి నిరూపితమైంది...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన రికార్డు క్రియేట్ చేసింది. డబ్ల్యూపీఎల్‌లో వేలానికి వచ్చిన మొట్టమొదటి క్రికెటర్ స్మృతి కోసం ఫ్రాంఛైజీలన్నీ పోటీపడ్డాయి. రూ. 3 కోట్ల 40 లక్షల భారీ ధరకి స్మృతి మంధానని దక్కించుకుంది ఆర్‌సీబీ...
26
భారత కరెన్సీలో రూ.3 కోట్ల 40 లక్షలు అంటే పాక్ రూపాయల్లో దాని విలువ 10 కోట్ల 72 లక్షల పాక్ రూపాయలు. ఇదే సమయంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, పాక్ సూపర్ లీగ్‌లో అత్యధిక మొత్తం అందుకుంటున్న క్రికెటర్‌గా ఉన్నాడు.
36
Women Premier league Auction
బాబర్ ఆజమ్ అందుకునే మొత్తం రూ.2 కోట్ల 30 లక్షలు... అదే భారత కరెన్సీలో వచ్చేసరికి రూ. కోటి 40 లక్షలు మాత్రమే. అంటే పీఎస్‌ఎల్‌లో అత్యధిక మొత్తం అందుకుంటున్న బాబర్ ఆజమ్ కంటే స్మృతి మంధాన రెండున్నరెట్లు ఎక్కువ మొత్తమే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా అందుకోబోతోంది...
46
లక్షల కోట్ల బ్రాండ్ వాల్యూ కలిగిన ఐపీఎల్‌తో పోల్చుకునే పాక్ క్రికెటర్లు, ముందుగా ఇప్పుడిప్పుడే ప్రారంభం కాబోతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని దాటగలరేమో చూసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్యాన్స్...
56
ఐపీఎల్‌లో 2009 నుంచి పాక్ క్రికెటర్లకు అనుమతి లేదు. భారత మహిళల ప్రీమియర్ లీగ్‌లో కూడా పాక్ మహిళా క్రికెటర్లకు అనుమతి దక్కలేదు. ఐపీఎల్ ఆడలేకపోతున్నామని చాలామంది పాక్ క్రికెటర్లు ఫీల్ అవుతుంటారు.
66
ఐపీఎల్ ఆడే అదృష్టం దక్కడం లేదనే అక్కసుతోనే ‘అందని ద్రాక్ష పుల్లన’ అన్నట్టుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని, పీఎస్‌ఎల్‌తో పోలుస్తూ కామెంట్లు చేస్తుంటారు... నిజానికి వాళ్లకి కూడా కూడా బీసీసీఐ ముందు పీసీబీ దేనికి పనికి రాదనే విషయం తెలుసు...