సూర్య... నీ ఆట నాకెంతో నచ్చింది... సింగర్ శ్రేయా ఘోషల్ ట్వీట్...

Published : Mar 20, 2021, 06:00 PM IST

ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూసిన సూర్యకుమార్ యాదవ్, రాకరాక వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాకపోయినా, రెండో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చి అర్ధశతకం నమోదుచేశాడు...

PREV
18
సూర్య... నీ ఆట నాకెంతో నచ్చింది... సింగర్ శ్రేయా ఘోషల్ ట్వీట్...

అంతర్జాతీయ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్‌గా మలిచిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్...

28

బౌండరీతో అర్ధశతకాన్ని అందుకున్న సూర్యకుమార్ యాదవ్, 31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి అవుటైన విషయం తెలిసిందే... సూర్యకుమార్ యాదవ్ ఆటపై స్పందించింది సింగర్ శ్రేయా ఘోషల్..

38

‘సూర్యకుమార్ యాదవ్ నీ ఆట నాకెంతో నచ్చింది... అంపైర్ నిర్ణయం చూసి బాధేసింది. నాకు తెలిసి అది క్లియర్‌గా నాటౌట్. మేమంతా నిన్ను చూసి గర్వపడుతున్నాం సూర్య...

48

నువ్వు, మా సోదరడు సౌమ్యదీప్ ఘోషల్ కలిసి చిన్నప్పుడు అనుశక్తినగర్ కాలనీ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతుండడం నాకు ఇంకా గుర్తుంది... నిన్ను ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది...’ అంటూ ట్వీట్ చేసింది బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషల్...

58

శ్రేయా ఘోషల్ ట్వీట్‌కి ఆమె సోదరుడు సౌమ్యదీప్ ఘోషల్ కూడా స్పందించాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా ఆరంగ్రేటం చేశావు... అదరగొట్టావు బ్రదర్... గర్వంగా ఉంది’ అంటూ కామెంట్ చేశాడు సౌమ్యదీప్.

68

సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో మొదటి బంతికే సిక్సర్ బాదిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాతి బంతికే అదే షాట్‌కి ప్రయత్నించి డేవిడ్ మలాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైన విషయం తెలిసిందే...

78

అయితే టీవీ రిప్లైలో బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించినా, థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది...

88

టీమిండియా సారథి విరాట్ కోహ్లీతో పాటు వసీం జాఫర్, వీరేంద్ర సెహ్వాగ్, గ్రేమ్ స్వాన్ వంటి మాజీ క్రికెటర్లు కూడా సూర్యకుమార్ యాదవ్ అవుట్ అంటూ ప్రకటించిన నిర్ణయంపై ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేశారు...
 
click me!

Recommended Stories