8వ స్థానంలో వచ్చి సెంచరీ... ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ డ్రా చేసుకున్న సౌతాఫ్రికా...

Published : Jul 17, 2021, 12:28 PM IST

పసికూన ఐర్లాండ్ చేతుల్లో ఎదురైన పరాభవం నుంచి సౌతాఫ్రికా త్వరగానే కోలుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండో వన్డేలో సౌతాఫ్రికాకి ఊహించని షాక్ ఇచ్చింది ఐర్లాండ్. మూడో వన్డేలో సఫారీ జట్టు 70 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది...

PREV
15
8వ స్థానంలో వచ్చి సెంచరీ... ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ డ్రా చేసుకున్న సౌతాఫ్రికా...

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా... నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 346 పరుగుల భారీ స్కోరు చేసింది. వికెట్ కీపర్ డి కాక్ 91 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 120 పరుగులు చేయగా, వాన్ డేర్ దుస్సేన్ 30 పరుగులు చేశాడు.

25

ఓపెనర్ జానేమన్ మలాన్ 169 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డి కాక్, మలాన్ కలిసి తొలి వికెట్‌కి 225 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.. 

35

347 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఐర్లాండ్ జట్టు 47.1 ఓవర్లలో 276 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయినా లోయర్ ఆర్డర్‌లో కుర్టీస్ కాంపర్ 54 పరుగులు చేయగా 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సిమి సింగ్ సెంచరీతో చెలరేగాడు.

45

91 బంతుల్లో 14 ఫోర్లతో 100 పరుగులు చేసిన సిమి సింగ్ నాటౌట్‌గా నిలవగా, కాంపర్ అవుటైన తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ అతనికి సరైన సహకారం అందించలేకపోయారు...

55

వన్డేల్లో 8వ స్థానంలో వచ్చి సెంచరీ నమోదుచేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సిమి సింగ్.  2018లో తన మొదటి మ్యాచ్‌లోనే టీ20ల్లో 8వ స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ చేసిన ఆరంగ్రేట ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

click me!

Recommended Stories