పాకిస్తాన్ ఈ లెవెల్లో ఇరగదీసిందో... టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకి షాక్ తప్పదా...

First Published Jul 17, 2021, 11:55 AM IST

క్రికెట్‌లో మోస్ట్ అన్‌ప్రిడెక్టబుల్ టీమ్ పాకిస్తాన్. పాక్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఊహించడం చాలా కష్టం. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వప్ అయిన పాకిస్తాన్, మొదటి టీ20 మ్యాచ్‌లో ఇరగదీసింది. టీ20ల్లో అత్యధిక స్కోరు నమోదుచేసి, టీ20ల్లో నెం.1 ర్యాంకులో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌కి షాక్ ఇచ్చింది.

20 ఓవర్లలో 232 పరుగుల భారీ స్కోరు చేసిన పాకిస్తాన్, బౌలింగ్‌లోనే ఇరగదీసి ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. లియామ్ లివింగ్ స్టోన్ ఒక్కడూ ఒంటరిపోరాటం చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 201 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
undefined
అయితే పాక్ పర్ఫామెన్స్, టీమిండియా ఫ్యాన్స్‌లో కొత్త గుబులు రేకెత్తిస్తోంది. పూర్తిగా కొత్త వాళ్లతో బరిలో దిగిన ఇంగ్లాండ్ సీ టీమ్ చేతుల్లో వన్డే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్, టాప్ ప్లేయర్లతో నిండిన జట్టును టీ20ల్లో చిత్తు చేసింది...
undefined
ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత జట్టుకి, పాకిస్తాన్‌పై మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత్, పాక్ మధ్య ఐదు మ్యాచులు జరగగా, ఐదుసార్లు టీమిండియాకే విజయం దక్కింది...
undefined
అయితే ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్‌ను చిత్తు చేస్తుందనే ధీమా, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో వచ్చిన రిజల్ట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. పక్కా విజయం మనదే అనే కాన్ఫిడెన్స్ ముందు, పాక్ ఊహించని పర్ఫామెన్స్‌ టీమిండియా ఫ్యాన్స్ కళ్లకు బైర్లు కమ్మేలా చేశాయి.
undefined
టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్ బీలో ఉన్న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లో దయాదీ జట్టు ఇలాంటి పర్ఫామెన్స్ ఇస్తే మాత్రం టీమిండియా విజయం సాధించడం కష్టమే. లివింగ్‌స్టోన్ మెరుపు సెంచరీతో ఆదుకోవడంతో ఇంగ్లాండ్ 201 పరుగుల స్కోరు అయినా చేయగలిగింది, భారత జట్టు దాని దరిదాపుల్లోకి రావడమూ కష్టమే..
undefined
ఎలా చూసినా పాకిస్తాన్ రీసెంట్ పర్ఫామెన్స్‌ను చూసి, భారత జట్టు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బరిలో దిగితే మాత్రం మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు...
undefined
న్యూజిలాండ్‌పైన టీమిండియాకి పెద్ద చెప్పుకోదగ్గ రికార్డు లేదు. 2003 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఏ ఐసీసీ టోర్నీలోనూ కివీస్‌పై విజయం సాధించలేకపోయింది భారత జట్టు. కాబట్టి ఆ మ్యాచ్ ఓడినా మిగిలిన జట్లతో జరిగే మ్యాచులు ఈజీగా గెలిచి, భారత జట్టు సెమీస్ చేరుతుందని భావించారు టీమిండియా ఫ్యాన్స్...
undefined
అయితే పాకిస్తాన్ తమను తక్కువ అంచనా వేస్తే, ఏమవుతుందో దిమ్మతిరిగిపోయే రేంజ్‌ పర్ఫామెన్స్‌‌తో హెచ్చరికలు ఇచ్చేసింది.
undefined
కాబట్టి గ్రూప్ 2లో అన్నీ వన్‌సైడ్ మ్యాచులు అవుతాయని భావించిన ఫ్యాన్స్, పాక్ పర్ఫామెన్స్ తర్వాత ఇందులోనూ ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుందని ఫిక్స్ అయిపోయారు.
undefined
పాకిస్తాన్ మాత్రమే కాదు, ఐర్లాండ్ జట్టు కూడా అదరగొడుతోంది. టీ20 వరల్డ్‌కప్ గ్రూప్ స్టేజ్‌లో ఉన్న ఐర్లాండ్, సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో గెలిచింది, మూడో వన్డేలో 347 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగి 276 పరుగులు చేయగలిగింది.. ఓ పసికూన జట్టు ఈ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
undefined
టీ20 స్పెషలిస్టులతో నిండిన ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల కంటే అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి సూపర్ 12కి నేరుగా అర్హత సాధించింది ఆఫ్ఘాన్. కాబట్టి వారినీ తక్కువ అంచనా వేయలేం...
undefined
ఎలా చూసినా గ్రూప్ 2లో భారత్, న్యూజిలాండ్ తప్ప మిగిలిన టీమ్‌లు వీక్‌గా ఉన్నాయనే ట్రోల్స్ వచ్చిన కొన్ని గంటల్లోనూ పాక్ జట్టు... వాటిని తిప్పికొట్టింది. తాము కూడా టైటిల్ ఫేవరెట్స్ లిస్టులో ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది.
undefined
click me!