ఐపీఎల్ - 16 సీజన్ లో ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు మరోసారి ఆవిరైనా తన వంతు పాత్ర పోషించిన ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ.. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో రికార్డుల దుమ్ము దులిపిన విషయం తెలిసిందే. తాజాగా కోహ్లీ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
26
భారత్ లో ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్‌గా ఉన్న కోహ్లీ.. ఇప్పుడు తన రేంజ్‌ను ఇండియా దాటి ఆసియా ఖండాన్ని కూడా విస్తరించాడు. ఇన్‌స్టాలో మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న అథ్లెట్లలో కోహ్లీ.. ఏకంగా 250 మిలియన్స్ ఫాలోవర్స్ తో మరెవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఆసియా ఖండంలో ఇంతమంది ఫాలోవర్లు కలిగిన స్పోర్ట్స్‌మెన్ మరొకరు లేరు.
36
క్రీడల్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రిస్టియానో రొనాల్డో కు ఇన్‌స్టాలో 585 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా రెండో స్థానంలో అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ 462 మిలియన్స్ ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి తర్వాత మూడో స్థానాన్ని కోహ్లీ దక్కించుకోవడం గమనార్హం.
46
భారత్ లో అయితే కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. కోహ్లీకి 25 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు ఇన్‌స్టాలో 40.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. టీమిండియాకు మూడు ఐసీసీ వరల్డ్ కప్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనికి 42.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
56
ఇప్పటివరకూ 25 కోట్ల ఫాలోవర్స్ కలిగిన కోహ్లీ.. తన ఇన్‌స్టాలో 278 మందిని ఫాలో అవుతున్నాడు. ఇందులో సచిన్, ఏబీ డివిలియర్స్, రొనాల్డో వంటి వారు ఉన్నారు. కోహ్లీ ఇప్పటివరకూ 1,601 పోస్టులు చేశాడు.
66
Image credit: PTI
కాగా ఐపీఎల్ - 16 లో ప్లేఆఫ్స్ కు ముందే ఆర్సీబీ కథ ముగియడంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన కోహ్లీ.. జాతీయ జట్టు బాధ్యతలు స్వీకరించాడు. వచ్చే నెల 7 నుంచి 11 వరకూ ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్రస్తుతం యూకేలో ఉన్న కోహ్లీ ఈ ప్రిపరేషన్స్ లోనే ఉన్నాడు.