సారీ! ఆమె ఎవరో కూడా నాకు తెలీదు... రష్మిక మంధాన పరువు తీసేసిన శుబ్‌మన్ గిల్...

Published : Mar 07, 2023, 02:43 PM ISTUpdated : Mar 07, 2023, 02:54 PM IST

అదృష్టం బాగా కలిసి రావడంతో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మంధాన...  అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించేసింది. ‘కిర్రాక్ పార్టీ’తో తెరంగ్రేటం చేసి, ‘ఛలో’ సినిమాతో తెలుగులోకి వచ్చిన రష్మిక, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పుష్ప’ సినిమాలతో టాప్ హీరోయిన్ అయిపోయింది...

PREV
15
సారీ! ఆమె ఎవరో కూడా నాకు తెలీదు... రష్మిక మంధాన పరువు తీసేసిన శుబ్‌మన్ గిల్...
Rashmika Mandanna

బాలీవుడ్ సినిమాల్లోనూ మెరుస్తున్న రష్మిక మంధాన, చిట్టి పొట్టి దుస్తుల్లో పబ్లిక్‌లోకి రావడానికి కూడా ఏ మాత్రం ఇబ్బంది పడదు. ‘వారిసు’ సినిమాతో కోలీవుడ్‌లో సూపర్ హిట్ కొట్టిన రష్మిక మంధాన, బాలీవుడ్‌లో రణ్‌బీర్‌తో చేస్తున్న ‘యానిమల్’పై భారీ అంచనాలే పెట్టుకుంది...

25

‘పుష్ఫ’ సినిమా తర్వాత రష్మికని ‘నేషనల్ క్రష్’ అంటూ కథనాలు ప్రచురితమయ్యాయి. తాజాగా యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్, రష్మిక నా ఫస్ట్ క్రష్ అని చెప్పినట్టు ఓ ఇంగ్లీష్ మీడియా కథనాన్ని ప్రచురించింది. అయితే శుబ్‌మన్ గిల్ ఈ వార్తలపై స్పందించాడు..

35

‘నేను ఏ మీడియాతో ఈ మాట చెప్పాను. నేను ఎవ్వరితోనే ఇలా చెప్పినట్టు నాకు గుర్తులేదు. తన ఎవరో కూడా నాకు తెలీదు..’ అంటూ ఇన్‌స్టాలో కామెంట్ చేశాడు శుబ్‌మన్ గిల్. 23 ఏళ్ల శుబ్‌మన్ గిల్, సచిన్ కూతురు సారా టెండూల్కర్, సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్‌లతో ప్రేమాయణం నడిపాడు..

45
Image: Rashmika Mandanna Instagram

సారా టెండూల్కర్‌తో బ్రేకప్ తర్వాత ప్రస్తుతం సారా ఆలీ ఖాన్‌తో శుబ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమల్లో ఉన్నాడని తెగ ప్రచారం జరుగుతోంది. అలాంటి శుబ్‌మన్ గిల్, తన క్రష్ అంటూ రష్మిక మంధాన పేరు ఎందుకు చెబుతాడని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు...
 

55

గిల్, తన క్రష్ అని చెప్పిన వార్త వైరల్ కావడంతో ఒక్కసారిగా ‘నేషనల్ క్రష్ రష్మిక మంధాన’ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు ఆమె అభిమానులు. ఇప్పుడు శుబ్‌మన్ గిల్, ఆమె ఎవరో కూడా తెలియదని అవమానించడంతో మరోసారి రష్మిక పేరు ట్రెండింగ్‌లో నిలుస్తోంది...

Read more Photos on
click me!

Recommended Stories