ఆఖరి టెస్టులో కుల్దీప్ యాదవ్! ఏకంగా నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగేందుకు టీమిండియా ప్లాన్?...

Published : Mar 07, 2023, 02:17 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో మొదటి రెండు టెస్టులు గెలిచిన భారత జట్టుకి ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో షాక్ తగిలింది. ఆసీస్ టీమ్‌ని ఇబ్బంది పెట్టేందుకు తయారుచేసిన స్పిన్ ఉచ్చులో స్వయంగా చిక్కుకున్న టీమిండియా, 9 వికెట్ల తేడాతో ఓడింది...

PREV
18
ఆఖరి టెస్టులో కుల్దీప్ యాదవ్! ఏకంగా నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగేందుకు టీమిండియా ప్లాన్?...
Image credit: PTI

ఆస్ట్రేలియా స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు క్రీజులో నిలబడేందుకు బాగా ఇబ్బంది పడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకి ఆలౌట్ అయిన భారత జట్టు, పట్టుమని 34 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది...
 

28
Image credit: PTI

రెండో ఇన్నింగ్స్‌లో ఛతేశ్వర్ పూజారా హాఫ్ సెంచరీ కారణంగా 163 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పూజారా మినహా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మరే ఇతర భారత బ్యాటర్ కూడా 30+ స్కోరు చేయలేకపోయాడు... మూడో టెస్టు ఓటమితో నాలుగో టెస్టుపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి..

38
Image credit: PTI

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో మార్చి 9 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు జరగనుంది. టీమిండియా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే ఈ టెస్టు మ్యాచ్ తప్పక గెలిచి తీరాల్సిందే...
 

48
Image credit: PTI

1982లో నిర్మించిన మొతేరా క్రికెట్ స్టేడియాన్ని 2006లో మరమ్మత్తులు చేసి, కెపాసిటీని 5 వేలు పెంచారు. 2015 తర్వాత పూర్తిగా కూల్చి, పునః నిర్మించారు. లక్షా 32 వేల కెపాసిటీతో దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా ఆవిర్భవించింది అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం...

58
Kuldeep Yadav

పునఃనిర్మాణం తర్వాత ఈ స్టేడియంలో రెండు టెస్టు మ్యాచులు జరగగా రెండింటిలోనూ ఇంగ్లాండ్‌ని చిత్తుగా ఓడించి, ఘన విజయాలు అందుకుంది భారత జట్టు.  ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 317 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా, నాలుగో టెస్టులో ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ని ఓడించింది...

68
Kuldeep Yadav

అయితే ఈ రెండు టెస్టు మ్యాచులు కూడా రెండు రోజుల్లోనే ముగిశాయి. స్పిన్‌కి అద్బుతంగా సహకరించే ఈ స్టేడియంలో అక్షర్ పటేల్, 20 వికెట్లు పడగొట్టాడు. దీంతో నాలుగో టెస్టులో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లతో పాటు కుల్దీప్ యాదవ్‌ని కూడా ఆడించాలని భావిస్తోందట భారత క్రికెట్ టీమ్...

78
Image credit: PTI

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, బ్యాటుతోనూ 40 పరుగులు చేసి రాణించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. అయితే ఆ తర్వాత రెండో టెస్టులో చోటు కోల్పోయిన కుల్దీప్ యాదవ్, ఆస్ట్రేలియాతో మొదటి మూడు టెస్టుల్లో చోటు దక్కించుకోలేకపోయాడు...

88
kuldeep

మూడో టెస్టు ఓటమితో కుల్దీప్ యాదవ్‌ని కూడా బరిలో దిగి, ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాలని ప్రయత్నాలు చేస్తోందట టీమిండియా. మహ్మద్ సిరాజ్ లేదా ఉమేశ్ యాదవ్‌లలో ఒకే ఫాస్ట్ బౌలర్‌ని టీమ్‌లోకి తీసుకుని నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగితే గెలవడం కష్టమేమీ కాదని టీమిండియా భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.. 

click me!

Recommended Stories