శుబ్‌మన్ గిల్ ప్రతాపం అంతా ఫ్లాట్ పిచ్‌పైనే! కొంచెం కష్టంగా ఉంటే, అస్సలు ఆడలేడు... - ఆకాశ్ చోప్రా

Published : Aug 13, 2023, 05:29 PM IST

అతి తక్కువ కాలంలోనే టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా మారిపోయాడు శుబ్‌మన్ గిల్. డబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా ఇషాన్ కిషన్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి, శుబ్‌మన్ గిల్‌ని ఆడించింది టీమిండియా మేనేజ్‌మెంట్... 

PREV
19
శుబ్‌మన్ గిల్ ప్రతాపం అంతా ఫ్లాట్ పిచ్‌పైనే! కొంచెం కష్టంగా ఉంటే, అస్సలు ఆడలేడు... - ఆకాశ్ చోప్రా

హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ బాదిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత అహ్మదాబాద్‌లో టీ20 సెంచరీ బాదాడు. అయితే విదేశాల్లో మాత్రం శుబ్‌మన్ గిల్‌కి చెప్పుకోదగ్గ రికార్డు లేదు..

29

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శుబ్‌మన్ గిల్, మూడో వన్డేలో 85 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. తొలి మూడు టీ20ల్లో ఫెయిల్ అయిన శుబ్‌మన్ గిల్, ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20లో 47 బంతుల్లో 77 పరుగులు చేశాడు..

39

యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కి 165 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించిన శుబ్‌మన్ గిల్, టీమిండియా తరుపున తొలి వికెట్‌కి అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పాడు...  

49
Shubman Gill-Yashasvi Jaiswal

‘ఫ్లోరిడాలో వెళ్లగానే ఫ్లాట్ పిచ్ స్వాగతం ఇచ్చింది. ఈ పిచ్ చూడగానే గిల్ బాదేస్తాడని అనుకున్నా. ఎందుకంటే శుబ్‌మన్ గిల్ బాగా ఆడాలంటే ఎలాంటి పిచ్ కావాలో అలాంటి పిచ్ దొరికింది..

59

అహ్మదాబాద్‌లో కూడా ఇలాంటి బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. అతని ప్రతాపం అంతా అహ్మదాబాద్‌లో, ఇలాంటి ఫ్లాట్ పిచ్‌ల మీదే..  ఫ్లాట్ పిచ్‌లపైన పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు...
 

69
Shubman Gill

గ్రీన్ పిచ్‌పైన జేమ్స్ అండర్సన్‌ని ఫేస్ చేయడం ఎంత కష్టమో, శుబ్‌మన్ గిల్‌ని ఇలాంటి ఫ్లాట్ పిచ్‌పైన పరుగులు చేయకుండా నియంత్రించడం కూడా అంతే కష్టం. అనిల్ కుంబ్లేకి టర్నింగ్ పిచ్ ఇస్తే, ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి మ్యాచ్ గెలిపిస్తాడు..
 

79
Shubman Gill

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఫ్లాట్ పిచ్ మీద టన్నుల కొద్ది పరుగులు చేశారు. శుబ్‌మన్ గిల్ కూడా అదే రకమైన ప్లేయర్. అతను వికెట్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలెట్టాడు. మరో ఎండ్‌లో జైస్వాల్ వేగంగా ఆడడంతో అతనికి స్లో ఆడేందుకు అవకాశం దొరికింది..

89
Kane Williamson and Shubman Gill

ఓడియన్ స్మిత్ లాంటి బౌలర్ రాగానే తన ప్రతాపం చూపించి, ఒకే ఓవర్‌లో 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 16 పరుగులు రాబట్టాడు. తన స్ట్రైయిక్ రేట్‌ని పెంచుకోవడానికి ఎలాంటి బౌలర్ కావాలో అతనే స్మిత్‌లా కనిపించాడు..ఈ పిచ్‌లపైన ఆడితే గిల్ గణాంకాలు మెరుగవుతాయి..

99
Image credit: PTI

అయితే అసలు సిసలైన మ్యాచ్ విన్నర్ కావాలంటే మాత్రం టర్నింగ్ పిచ్‌లపైన కూడా పరుగులు చేయగలగాలి. అప్పుడు శుబ్‌మన్ గిల్, ఫ్యూచర్ స్టార్ అవుతాడు. లేదంటే ఓ సాధారణ బ్యాటర్‌గానే మిగిలిపోతాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా..
 

Read more Photos on
click me!

Recommended Stories