యాషెస్ సిరీస్ 2023 టోర్నీ, క్రికెట్ ఫ్యాన్స్‌కి భలే కిక్ అందించింది. మొదటి మ్యాచ్ నుంచి ఆఖరి మ్యాచ్ వరకూ ప్రతీ టెస్టు కూడా నువ్వా-నేనా అన్నట్టుగానే సాగింది. బెన్ స్టోక్స్ బజ్ బాల్ కాన్సెప్ట్‌కి, ప్యాట్ కమ్మిన్స్ కూల్ బాల్ కాన్సెప్ట్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది..
నాలుగో టెస్టు వర్షం కారణంగా ఫలితం తేలకుండా డ్రాగా ముగియగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చెరో రెండేసి మ్యాచులు గెలిచాయి. 2-2 తేడాతో యాషెస్ 2023 డ్రా కాగా, 2021లో 4-0 తేడాతో యాషెస్ గెలిచిన ఆస్ట్రేలియా, సిరీస్‌ని రిటైన్ చేసుకుంది..
26
Steve Smith
యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కలిసి బీర్ తాగి సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఓవల్ టెస్టు తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్లు, గంటల తరబడి డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కావడంతో ఈసారి బీర్ పార్టీ జరగలేదు.. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్, ప్రస్తుత టెస్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ విషయంపై స్పందించాడు...
36
Steve Smith Catch
‘మేం చాలా సార్లు, ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్లి తలుపులు కొట్టి పిలిచాం. మేం అప్పటికే చాలా సేపటి నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాం. స్టోకీ (బెన్ స్టోక్స్) వచ్చి, రెండు నిమిషాలు అని చెప్పి లోపలికి వెళ్లాడు.. గంటలు గడిచిపోయాయి, రాలేదు..
46
Steve Smith
ఇంకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదని అనిపించింది. బీర్ తాగుతున్నామా? లేదా అనే విషయం పక్కనబెడితే, పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక వెళ్లిపోయాం. నా కెరీర్‌లో మొదటి సారి యాషెస్ సిరీస్ తర్వాత బీర్ పార్టీ జరగలేదు. ఇది సిగ్గు చేటు.. ’ అంటూ కామెంట్ చేశాడు స్టీవ్ స్మిత్...
56
Ben Stokes
దీనిపై ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ రియాక్ట్ అయ్యాడు. ‘ఓ ఇంగ్లాండ్ ప్లేయర్‌కి ఏదో ముఖ్యమని పని పడింది. అది పూర్తవ్వడానికి అనుకున్నదానికంటే చాలా సమయం పట్టింది. అయితే ఆ రోజు రాత్రి నైట్‌క్లబ్‌లో పార్టీ ఉంటుందని వాళ్లకి చెప్పాను..’ అంటూ కామెంట్ చేశాడు బెన్ స్టోక్స్...
66
Ben Stokes
అయితే నైట్ క్లబ్ పార్టీకి స్టీవ్ స్మిత్ హాజరు కాలేదు. ‘ఆ రోజు రాత్రి నైట్ క్లబ్‌లో పార్టీకి కొందరు ఆస్ట్రేలియా ప్లేయర్లు వెళ్లారని విన్నాను. అయితే అప్పటికే నేను ఇంటికి వచ్చేశాను కూడా. ఓ అద్భుతమైన సిరీస్ తర్వాత బీర్ తాగకుండా ఇంటికి రావడం మాత్రం అవమానకరంగా అనిపించింది..’ అంటూ కామెంట్ చేశాడు స్టీవ్ స్మిత్..