డెవాన్ కాన్వే ఎక్కడ?
CSK కోసం 15 మ్యాచ్‌లలో 672 పరుగులు చేసిన డెవాన్ కాన్వేను 2 మ్యాచ్‌లలో ఆడించకపోవడం పెద్ద తప్పు. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే కాన్వే ఓపెనింగ్‌లో దిగి చాలా మ్యాచ్‌లలో CSKకు విజయాన్ని అందించాడు. అతనికి బదులుగా ఆడుతున్న సామ్ కరణ్ పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో సామ్ కరణ్‌కు బదులుగా డెవాన్ కాన్వేను ఆడిస్తే చెన్నై విన్నింగ్ ట్రాక్ లోకి వస్తుంది.
సీఎస్కేలో పరుగుల సునామీ ఆటగాళ్లు లేరు
ఇతర జట్లలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నికోలస్ పూరన్, మార్ష్, రజత్ పటిదార్ వంటి 20 బంతుల్లో అర్ధ సెంచరీ చేసే ఆటగాళ్లు ఉండగా, CSKలో అలాంటి ఆటగాళ్లు లేకపోవడం దురదృష్టకరం. శివమ్ దూబే, ధోనీ లేరా? అని మీరు అడగవచ్చు. దూబేకు అన్ని మ్యాచ్‌లలోనూ దూకుడుగా ఆడే సామర్థ్యం లేకపోవడం చెన్నై టీమ్ కు మైనస్. వయసు కారణంగా ధోనీ 25 బంతుల కంటే ఎక్కువసేపు మైదానంలో ఆడటం కష్టమైన విషయం. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కరణ్, జడేజా వంటి మీడియం వేగంతో ఆడే బ్యాట్స్‌మెన్‌లను CSK ఎక్కువగా కలిగి ఉండటం పెద్ద లోపం.