అటు ఆర్ఆర్ఆర్‌, ఇటు ఐపీఎల్... రెండింటినీ వదలని కరోనా! మహారాష్ట్ర సర్కార్ యూటర్న్?

Published : Mar 21, 2022, 02:16 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌కి సమయం దగ్గర పడుతోంది. 10 ఫ్రాంఛైజీలతో 74 రోజుల పాటు సాగే ఈ మెగా లీగ్ కోసం ఐపీఎల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత రెండు సీజన్లలో ఐపీఎల్‌ను తీవ్రంగా దెబ్బేసిన కరోనా వైరస్, ఈసారి కూడా ఈ మెగా క్రికెట్ లీగ్‌పై ప్రభావం చూపేలా కనిపిస్తోంది...

PREV
111
అటు ఆర్ఆర్ఆర్‌, ఇటు ఐపీఎల్... రెండింటినీ వదలని కరోనా! మహారాష్ట్ర సర్కార్ యూటర్న్?

ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయం దగ్గర పడినప్పుడల్లా కరోనా కేసులు ఉన్నట్టుండి పెరగడం... చేసేదేమీ లేక రిలీజ్‌ను వాయిదా వేసుకుంటూ పోవడం చేస్తోంది చిత్ర యూనిట్...

211

అప్పుడెప్పుడో 2020 అక్టోబర్‌లో రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా... 2021కి, 2022 జనవరికి... ఆఖరికి కరోనా థర్డ్ వేవ్ ముగియడంతో మార్చి 25న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. 

311

అయితే సరిగ్గా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు, చిత్ర యూనిట్‌ని, ఫ్యాన్స్‌ని భయపెడుతున్నాయి. 

411

అటు ఆర్ఆర్ఆర్‌నే కాదు, ఐపీఎల్‌ని కూడా కరోనా వెంటాడుతోంది. ఐపీఎల్ 2020 సీజన్‌తో పాటు ఐపీఎల్ 2021 సీజన్‌పై కరోనా తీవ్రంగా ప్రభావం చూపింది.

511

సరిగ్గా ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు లాక్‌డౌన్ విధించడంతో దాదాపు ఆరు నెలల తర్వాత యూఏఈలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించాల్సి వచ్చింది...

611

ఎలాగోలా ఐపీఎల్ 2020 సీజన్‌ని సక్సెస్ చేసిన బీసీసీఐ, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో భారత్‌లో ఐపీఎల్ 2021 సీజన్‌ని ప్రారంభించింది బీసీసీఐ. అయితే ఐపీఎల్ ఆరంభానికి ముందు కరోనా కేసులు ఉన్నట్టుండి పెరగడంతో ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించాల్సి వచ్చింది...

711

ఐపీఎల్ సగం మ్యాచులు ముగిసిన తర్వాత బయో బబుల్‌లోనే కరోనా కేసులు వెలుగుచూడడంతో ఆకస్మాత్తుగా లీగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, ముందుజాగ్రత్తగా యూఏఈలో మిగిలిన మ్యాచులను నిర్వహించింది బీసీసీఐ...

811

ఈసారి ఐపీఎల్ 2022 మెగా సీజన్‌ను స్వదేశంలో, ప్రేక్షకులతో నిండిన స్టేడియాల్లో నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది బీసీసీఐ. అయితే ముచ్చటగా మూడో సీజన్‌లోనూ కరోనా, ఐపీఎల్‌ను వెంటాడేలా కనిపిస్తోంది...

911

చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ, మరణాల సంఖ్య కూడా రోజురోజుకీ ఎక్కువ అవుతుండడంతో దేశవ్యాప్తంగా భయాందోళనలు నెలకొంటున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా కనిపించింది...

1011

దీంతో ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచులకు 25 నుంచి 50 శాతం కెపాసిటీతో ప్రేక్షకులను అనుమతించాలని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం, కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చూస్తోందట...

1111

అదే జరిగితే ఐపీఎల్ 2022 సీజన్ కూడా ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాల్సి వస్తుంది. రెండు సీజన్లుగా ఐపీఎల్ మజాను స్టేడియంలో అనుభవించలేకపోయిన ఫ్యాన్స్‌కి ఇది నిజంగా బ్యాడ్ న్యూసే...

click me!

Recommended Stories